ఇలా చేశావేంటి నాని ? వైసీపీలో ప్రకంపనలు ?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలమైన గొంతుక వినిపిస్తూ, ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ అస్త్రాలు సంధించి,ప్రత్యర్థులను ఇరుకున పెట్టే విషయంలో ఎప్పుడూ ముందుండే ఏపీ మంత్రి కొడాలి నాని వ్యవహారం ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అవుతోంది.టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్, మరి కొంతమంది టిడిపి నాయకులను టార్గెట్ చేసుకుంటూ, నాని విమ,ర్శలు చేసేవారు.

 Ysrcp Leaders Angry On Minister Kodali Nani Coments, Ycp Leaders, Kodali Nani, B-TeluguStop.com

ఆ విమర్శలకు మంచి స్పందన రావడంతో పాటు, వైసీపీ లోనూ మంచి జోష్ కనిపించేది.ఇక మీడియాలో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ వ్యవహారం బాగా వైరల్ వస్తున్నాయి.ఏ విషయంపైన అయినా స్పందించాలి అంటే, జగన్ సైతం నానిని ముందు పెడుతూ వస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఏపీలో హిందూ మతానికి సంబంధించి తీవ్రస్థాయిలో దుమారం చెలరేగుతోంది.రాష్ట్రంలో వివిధ ఆలయాల్లో అపశృతులు చోటుచేసుకోవడంపై బీజేపీ, జనసేన, టీడీపీ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడుతూ విమర్శలు చేస్తున్నాయి.

ఇదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతాల వారి కోసం ఏర్పాటు చేసిన డెకరేషన్ ను తాజాగా రద్దు చేస్తూ టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు మొదలుపెట్టాయి.ఆ వ్యవహారంలో హిందూ దేవుళ్లకు సంబంధించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర స్థాయి లో దుమారం రేపుతోంది.

ఇప్పటికే ఈ వ్యవహారంపై బీజేపీ ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పట్టుబడుతూ, ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తోంది.నాని వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

నాని వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని, మరి ఇంత అదుపులేకుండా నాని మాట్లాడుతున్నా, ఆయనను జగన్ కట్టడి చేయడంలేదు అనే విమర్శలు ఇప్పుడు సొంత పార్టీలోనూ పెరిగిపోతున్నాయి.ఇప్పటి వరకు ప్రతిపక్షాలను ఉద్దేశించి ఎంత తీవ్రంగా విమర్శలు చేసినా, ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని, కానీ మతపరమైన అంశాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరి కాదు అంటూ సొంత పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube