ఇలా చేశావేంటి జగనన్న ? 

చాలా వినూత్నమైన విధానాలతో ముందుకు వెళ్లాలనే ఆకాంక్షతో సీఎం జగన్ చూస్తున్నారు.అందుకే ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయని అంత స్థాయిలో వినూత్నమైన పరిపాలనను ఏపీ ప్రజలకు అందిస్తున్నారు.

 Ysrcp Leaders Angry On Jagan Behaviour  Jagan,ysrcp, Party Leaders, Nominated Po-TeluguStop.com

గతంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయలేని సాహసమైన నిర్ణయాలను అమలు చేస్తూ, సంక్షేమ పథకాలను పెద్దఎత్తున అమలు చేస్తున్నారు.అలాగే బడుగు బలహీన వర్గాల వారికి, ఆర్థికంగా స్థితిమంతులు కాని వారికి పెద్దఎత్తున పదవులను కట్టబెట్టి తాను అందరికంటే భిన్నం అని నిరూపించుకుంటున్నారు.

మంత్రి పదవులు కాకుండా వివిధ నామినేటెడ్ పదవుల విషయంలో జగన్ ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు.అందుకే చిన్న చిన్న కార్యకర్తలకు పెద్ద స్థాయి పదవులు వైసీపీ ప్రభుత్వంలో దక్కాయి.

బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేస్తూ జగన్ పదవులను కట్టబెట్టారు.ఆర్థికంగా బలం లేకపోయినా, వారిని మరింతగా బలోపేతం చేసే విధంగా పదవులు కట్టబెడుతున్నారు.

దీని వల్ల ప్రజలలో జగన్ ఇమేజ్ బాగా పెరిగింది.అయితే ఇది జనాల్లో జగన్ ఇమేజ్ బాగా పెంచుతున్నా, మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న నాయకుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తిని రాజేసింది.

 మొదటి నుంచి తాము వైసిపి కోసం ఎంతో కష్టపడి ఎన్నో ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్న తమకు పదవులు విషయంలో జగన్ చిన్నచూపు చూస్తున్నారని, మొదటి నుంచి పార్టీని నమ్ముకుని అన్ని రకాలుగా అండదండలు అందించిన మమ్మల్ని కాదు అని , పెద్దగా పరిచయం లేని , పార్టీకి పెద్ద ఉపయోగం లేని వారికి పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టి తమను పక్కన పెట్టారని బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్ , డిప్యూటీ మేయర్ ఎంపికలో ఇదే సూత్రాన్ని పాటించడం పై ఇప్పుడు బహిరంగంగా అసంతృప్తి భగ్గుమంటోంది.

మేయర్ , మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీకి దిగిన వారంతా పెద్ద ఎత్తునే చేతి చమురు వదిలించుకున్నారు.కార్పొరేటర్, వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం పెద్ద ఎత్తునే సొమ్ములు ఖర్చు చేశారు.

అనుకున్నట్టుగానే వారంతా ఎన్నికల్లో గెలవడంతో వారి ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.

Telugu Ap Cm Jagan, Duputy Mayer, Jagan, Mayer, Ministers, Ysrcp-Telugu Politica

ఇక చైర్మన్, మేయర్ కుర్చీల్లో కూర్చోబోతున్నాం అనుకుంటున్న సమయంలో,  కొత్తవారిని తీసుకొచ్చి ఆ పదవుల్లో కూర్చోబెట్టడం పై ఆ పదవులపై ఆశలు పెట్టుకున్న వారంతా ఒక్కసారిగా జగన్ నిర్ణయంపై బగ్గు మంటున్నారు.పదవుల కోసం సొమ్ము ఖర్చు పెట్టి ఆశలు పెట్టుకున్న తమను కాదని, ఎవరెవరినో పదవుల్లో కూర్చోబెట్టడం ఏంటని ? ఇలా అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీకి విజయం కోసం పని చేసే నాయకులు దూరం అవుతారని , జగన్ ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటూ తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.ఈ విషయం లో ఎమ్మెల్యేలు , మంత్రులు సైతం  విధమైన అసంతృప్తితో జగన్ పై రగిలిపోతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube