వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు..!!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వివేకానంద రెడ్డి హత్య కేసు తిరుగుతున్నాయి.మరో మూడు రోజులలో తిరుపతిలో ఉప ఎన్నికలు జరగనున్న క్రమముల ఎన్నికల ప్రచారంలో టీడీపీ పార్టీ నేతలు జగన్ ని టార్గెట్ చేసుకుని వివేకానంద రెడ్డి హత్య కేస్ బేస్ చేసుకుని భారీగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

 Ysrcp Leader Sensational Comments On Vivekananda Reddy Case-TeluguStop.com

తాజాగా అలిపిరి వద్ద లోకేష్, టిడిపికి చెందిన కీలక నేతలు వివేకానంద రెడ్డి హత్య కేసులో వైయస్ కుటుంబానికి సంబంధం లేదని జగన్ ప్రమాణం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ హత్య కేసుకు సంబంధించి వైసీపీ పార్టీ నేత వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ మెరుగు నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో సామాజిక న్యాయం చేయడంలో వైసీపీ ప్రభుత్వం కీలకంగా రాణిస్తుంది అని కొనియాడారు.అంతేకాకుండా రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.సరిగ్గా అంబేద్కర్ ఆలోచన విధానానికి సరితూగే లా రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.చంద్రబాబు హయాంలో దళితులపై అనేక దాడులు జరిగాయని మండిపడ్డారు.

 Ysrcp Leader Sensational Comments On Vivekananda Reddy Case-వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదేవిధంగా తిరుపతి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు అంబేద్కర్ ఆలోచనా విధానాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని, బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అదేరీతిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ పార్టీ నేత సునీల్ దియోధర్ వైసిపి పార్టీ అభ్యర్థి మతం ఏంటి అని ప్రశ్నించటం అంబేద్కర్ ఆలోచన విధానమా అని నిలదీశారు.

వివేకానంద రెడ్డి హత్య హత్య కేసు విషయంలో అప్పట్లో మీ పార్టీలో ఉన్న ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి ని నిలదీయండి అంటూ మెరుగు నాగార్జున కౌంటర్లు వేశారు. 

.

#YSVivekananda #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు