మరోసారి అక్రమనిర్మాణాల పై క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్  

Botsa Satyanarayana Give Clarity About Unauthorised Building In Ap-chandrababu Naidu,tdp,unauthorised Buildings In Ap,ys Jagan,ysrcp,జగన్ సర్కార్

ఏపీ లో జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే ఏపీ లో అక్రమ కట్టడాలపై ప్రధాన దృష్టి సారించిన సంగతి తెలిసిందే. కరకట్ట వద్ద అక్రమంగా నిర్మాణాలు జరిగాయని తెలిపిన జగన్ సర్కార్ ప్రజావేదికను రాత్రికి రాత్రే కూల్చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మాజీ సీఎం చంద్రబాబు నివాసముంటున్న గెస్ట్ హౌస్ కూడా అక్రమకట్టడమే అని దానిని కూడా త్వరలో కూల్చివేస్తామంటూ జగన్ సర్కార్ ఇప్పటికే పలు మార్లు తెలిపింది..

మరోసారి అక్రమనిర్మాణాల పై క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్ -Botsa Satyanarayana Give Clarity About Unauthorised Building In AP

అంతేకాకుండా ఇప్పటికే ఆ గెస్ట్ హౌస్ బయట నోటీసులు కూడా అంటించారు. అయితే మరోసారి ఈ కరకట్ట పై ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేత పై మంత్రి బొత్స సత్యనారాయణ శాసన సభలో మరోసారి ఈ రోజు స్పష్టం చేశారు . కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలన్నింటికీ నోటీసులిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

శాసనసభలో అక్రమ కట్టడాలపై జరుగుతున్న చర్చలో అక్రమ కట్టడాల విషయంలో ప్రభుత్వ విధానమేంటని సభ్యుడు రామానాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బొత్స పై వివరాలను వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో కూడా 1,500 అక్రమ కట్టడాలు తొలగించారని గుర్తు చేసిన బొత్స ఇప్పటికే అక్రమ కట్టడాల్లో నివాసం ఉంటున్న వారికి కూడా నోటీసులు అందించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ యజమానికి, అలానే మాజీ సీఎం చంద్రబాబుకు కూడా నోటీసులిచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా కరకట్ట వద్ద నిర్మించిన అన్నీ అక్రమకట్టడాలను కూల్చివేస్తామంటూ మరోసారి స్పష్టం చేశారు.

అయితే జగన్ సర్కార్ నిర్ణయాన్ని ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తప్పుపట్టారు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన భవనాన్ని ఇలా నేలకూల్చడం కన్న ప్రజల అవసరార్ధం వాడుకొని ఉంటె బాగుండేది అని అభిప్రాయం వక్తం చేసిన విషయం విదితమే. మరి ఇప్పడు అక్రమకట్టడాల విషయంలో జగన్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. కూల్చివేస్తుందా,లేదా బీజేపీ పార్టీ అన్నట్లు వేరే అవసరాల కోసం వినియోగిస్తుందా అన్నది చర్చనీయంశంగా మారింది.