వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలో టెన్ష‌న్‌.. రీజ‌న్ ఇదే!

టీడీపీ అధినేత‌, సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో వైసీపీ నుంచి ఫిరాయించి సైకిలెక్కిన ఎమ్మెల్యేల్లో ఇప్పుడు కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది.నిన్న మొన్న‌టి వ‌ర‌కు తాము సేఫ్ జోన్ అని భావించిన వీరంతా ఇప్పుడు తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు.

 Ysrcp Jumping Mla’s Face New Problem In Tdp-TeluguStop.com

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ సిట్టింగ్ సీటు ఉంటుందో ఊడుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి వీరిని వెంటాడుతోంది.జ‌గ‌న్ వైఖ‌రితో విసిగిపోవ‌డం కావొచ్చు, సీఎం చంద్ర‌బాబు ఆక‌ర్ష్ మంత్ర ప్ర‌భావం కావొచ్చు దాదాపు 23 మంది చిన్న పెద్ద రాజ‌కీయ నేత‌లు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.

విడ‌తల వారీగా సాగిన ఈ కార్య‌క్ర‌మం ద్వారా వైసీపీని తీవ్రంగా దెబ్బ‌కొట్టాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం.ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు పార్టీలోకి లాగేసుకుని కండువా క‌ప్పారు.

అయితే, వీరంతా ఎలా ప‌నిచేస్తున్నారు?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరి ప‌రిస్థితి ఏంటి? మ‌ళ్లీ టిక్కెట్ ఇస్తే.ఎంత మేర‌కు గెలుస్తారు? వంటి కీల‌క అంశాల‌పై చంద్ర‌బాబు స‌మ‌గ్రంగా స‌ర్వే చేయించారు.ఈ స‌ర్వేలో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల‌తో అంత‌గా ట‌చ్‌లో ఉండ‌డం లేద‌ని తెలిసింది.దీంతో అలాంటి వారిని వెతికి ప‌ట్టుకున్న చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికి టికెట్ లేకుండా చేయాల‌ని డిసైడ్ అయ్యారు.

అయితే ఈ విష‌యంలోనే చంద్ర‌బాబు త‌న చాణిక్య వ్యూహాన్ని తెర‌మీద‌కి తెచ్చారు.ఎలాగూ వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పార్టీలు క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్నాయ‌నేది దాదాపు స్ప‌ష్ట‌మై పోయిన వ్య‌వ‌హారం.

ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా మార‌ని ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో గెలుపు గుర్రాలు ఎక్క‌లేర‌ని డిసైడ్ అయిన వారి సీట్ల‌ను జ‌న‌సేన‌కు కేటాయించే చాన్స్ ఉంద‌ని తెలుస్తోంది.

వీటిలో ప్ర‌ధానం క‌దిరి సీటు, విజ‌య‌వాడ ప‌శ్చిమ సీటును జ‌న‌సేనకు కేటాయిస్తార‌ని తెలుస్తోంది.

అదేవిధంగా వంత‌ల రాజేశ్వ‌ర‌ని కూడా ఇంటికే ప‌రిమితం చేయ‌నున్నార‌ని స‌మాచారం.ఇక‌, ఈ విష‌యంపై ఉప్పందిన ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో చాలా మంది ఇప్పుడు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నా ర‌ట‌.

ఎందుకు పార్టీ మారామా? అని వారు చింతిస్తున్నార‌ట‌.అంతేకాదు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ మ‌ళ్లీ మీ టీంలో చేరిపోతాం! అంటూ వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు మొక్కుకుంటున్నా ర‌ట‌.

ఇప్పటికే ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు నేరుగా జగన్ను కాంటాక్ట్ చేయకపోయనా విజయసాయిరెడ్డి బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లతో మళ్లీ టచ్ లో ఉన్నట్లు వినిపిస్తోంది.వీరంతా మళ్లీ వైసీపీలోకి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే.వైసీపీ వారిని అబ్జర్వేషన్లో ఉంచి నమ్మకం కుదిరితేనే మళ్లీ తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ ప‌రిణామంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల ప‌రిస్థితి అడ‌క‌త్తెర‌లో ఉన్న‌ట్ట‌గా త‌యారైంద‌ట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube