జగన్ మారాల్సిందేనా లేకపోతే అంతేనా ?  

Ysrcp Jagan Senior Leaders - Telugu Appolitics, Decisions, Senior Leaders, Ys Jagan, Ys Jagan To Follow Senior Leaders, Ysrcp

వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా, రావాలి జగన్ కావాలి జగన్ అంటూ పాటలు పాడిన వైసిపి శ్రేణులు ఇప్పుడు, మారాలి జగన్, మారి తీరాలి జగన్ అంటూ కొత్త రాగం అందుకుంటున్నారు.ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది.

 Ysrcp Jagan Senior Leaders

ఈ ఏడాది పరిపాలనలో జగన్ జనం మెచ్చిన నాయకుడు గా తనను తాను నిరూపించుకున్నారు.జనరంజక పాలన ఏ విధంగా ఉంటుందో ప్రజలకు చేసి చూపించాడు.

అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి అందరి మన్ననలను పొందారు.పార్టీలకు అతీతంగా అందరినీ సమాన దృష్టితో చూస్తూ, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందే విధంగా సరికొత్త రీతిలో ఏర్పాట్లు చేశారు.

జగన్ మారాల్సిందేనా లేకపోతే అంతేనా -Political-Telugu Tollywood Photo Image

అలాగే రాష్ట్రానికి సంబంధించి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుని దేశంలోనే డైనమిక్ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇంత వరకు బాగానే ఉన్నా, సొంత పార్టీ నాయకుల్లో మాత్రం జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తి నెలకొంది.

జగన్ పార్టీని సంబంధించిన నాయకులను, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను సైతం సరిగా పట్టించుకోవడం లేదని, కనీసం కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదనే బాధలో వారు ఉన్నారట.మొత్తం పరిపాలన అంతా అధికారుల ద్వారానే చేస్తూ తమను సరిగా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదం అవుతుండడం వంటి వాటిని కూడా గుర్తు చేస్తున్నారు.పార్టీలో రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారని, వారి అనుభవాలను, వారి సలహాలను తీసుకుని జగన్ ముందుకు వెళ్తే ఎటువంటి ఇబ్బందులు రావని సూచిస్తున్నారు.

అలా కాకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా ముందుకు వెళ్దాం అంటే రాజకీయాల్లో ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది అని వారు గుర్తు చేస్తున్నారు.

ముఖ్యంగా కోర్టు వ్యవహారాలకు సంబంధించి ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పై చులకన భావం ఏర్పడిందని, ఒకటి కాదు, రెండు కాదు వరుసగా ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కోర్టు తప్పుపడుతూనే వస్తోందని, దానిని సరి చేసుకోకుండానే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ జగన్ అభాసుపాలవుతున్నారని, వీటన్నిటిని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు.జగన్ పరిపాలనా వ్యవహారాల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ఆ ప్రభావం పార్టీ పైన, ప్రభుత్వం పైన స్పష్టంగా కనిపిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు.ప్రభుత్వంలో ఏర్పడిన చిన్న చిన్న లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుని టిడిపి రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోందని, ఇప్పటికైనా జగన్ తాను నిర్ణయాలు తీసుకునే ముందు ఆవేశంతో కాకుండా ఆలోచనతో తీసుకుని అందరి సలహాలు తీసుకుంటే మంచిదని వారు సూచిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ysrcp Jagan Senior Leaders Related Telugu News,Photos/Pics,Images..

footer-test