ఏపీలో ఉప ఎన్నికల సందడి ? ఎక్కడెక్కడ అంటే ?  

Where is that By-Election Buzz In AP, AP Cm Jagan, TDP, Chandrababu Naidu, Vallabhaneni Vamshi, Gannavaram MLA, YSR, Raghu Ramakrishnam Raju, - Telugu Ap Cm Jagan, Chandrababu Naidu, Gannavaram Mla, Raghu Ramakrishnam Raju, Tdp, Vallabhaneni Vamshi, Ysr

ఏపీలో రాజకీయ సందడి మరోసారి మొదలయ్యే లా కనిపిస్తుంది.ప్రస్తుతం కరోనా వ్యవహారం తీవ్రంగా ఉండడంతో, ఆ వ్యవహారం ముగిసిన తరువాత ఉప ఎన్నికల సందడి తప్పదనే సంకేతాలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

 Ysrcp Jagan Raghurama Krishnam Raju Vallabhanenu Vamshi Ap By Election

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది.మళ్లీ ఈ ఉప ఎన్నికల సందడి ఏంటో అనే సందేహాలు ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతుంది.

ఇంతకీ విషయం ఏంటంటే, వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం అందరికీ తెలిసిందే.కొద్ది రోజులుగా ఆయన పార్టీపై అదేపనిగా విమర్శలు చేస్తూ ఉండడం, ఢిల్లీ స్థాయిలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంతనాలు చేస్తూ రావడం వంటి పరిణామాలను ఆ పార్టీ సీరియస్ గా తీసుకుంది.

ఏపీలో ఉప ఎన్నికల సందడి ఎక్కడెక్కడ అంటే -Political-Telugu Tollywood Photo Image

ఈ మేరకు ఆయనపై అనర్హత వేటు పడే విధంగా ఢిల్లీ స్థాయిలో జగన్ చక్రం తిప్పుతున్నారు.ఒకవేళ జగన్ ఫార్ములా సక్సెస్ అయితే నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో మళ్లీ ఉప ఎన్నికలు జరగడం తప్పదు.ఈ మేరకు అప్పుడే ఆ స్థానం నుంచి ఎవరిని అభ్యర్థిగా దించాలనే ఈ విషయంపై వైసిపి కసరత్తు చేస్తోంది.ఇదిలా ఉంటే మరో అసెంబ్లీ స్థానంలోనూ ఉప ఎన్నికలు వచ్చేలా కనిపిస్తున్నాయి.

కృష్ణాజిల్లా గన్నవరం టిడిపి రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపి కి మద్దతు ఇస్తున్నారు.ఇప్పటికే ఆయనను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది.ఇక ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదే విషయమై జగన్ తో కూడా చర్చించినట్లు సమాచారం.

వంశీ అభిప్రాయానికి జగన్ మద్దతు తెలిపితే, గన్నవరం నియోజకవర్గంలో ఉపఎన్నిక తప్పదు.ఇక వంశీ మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు కసరత్తు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.ఇదేవిధంగా టిడిపి కి రాజీనామా చేసి, వైసిపికి అనుబంధంగా ఉంటున్న మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.ఎంపీ ఉప ఎన్నికలకు సంబంధించి జగన్ సముఖంగానే ఉన్నా, మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదట.

ఉప ఎన్నికలకు వెళితే ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుందని, అక్కడ గెలిచి చూపించి తెలుగుదేశం పార్టీకి మరింత ఎదురుదెబ్బ తగిలే విధంగా చేయాలనే అభిప్రాయంతో జగన్ ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.మరి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో ?

#Gannavaram MLA #TDP #YSR #AP CM Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ysrcp Jagan Raghurama Krishnam Raju Vallabhanenu Vamshi Ap By Election Related Telugu News,Photos/Pics,Images..