గెలుపై జగన్ కు అనుమానం ఉందా ? ఆ మీటింగ్ అందుకేనా ?

మరో రెండు రోజుల్లో ఫలితాలు వచ్చేయడం .ఎవరు అధికార పీఠం మీద కూర్చోబోతున్నారో తెలిసిపోనుంది.

 Ysrcp Jagan Mohan Reddy Conducted In Meeting-TeluguStop.com

అయితే ఆ సమయానికి ముందే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అనే విషయం ఎగ్జిట్ పోల్స్ రూపంలో బయటకి వచ్చేసింది.ఫలితాలు ఏకపక్షమేనని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారం చేపట్టడం దాదాపు ఫిక్స్ అయిపోయిందని తేలిపోయింది.

దీనిపై వైసీపీలో కూడా జోష్ పెరగడంతో పాటు ఆ పార్టీ అధినేత జగన్ అధికారం మనదే అనే సంకేతాలు పార్టీ నాయకులకు ఇస్తున్నాడు.ఎగ్జిట్ పోల్స్ కూడా అధికారం వైసీపీ కే దక్కబోతుందని చెప్పడంతో పార్టీ అభ్యర్థులతో మంగళవారం అభ్యర్థులతో తలపెట్టిన భేటీని వైసీపీ అధ్యక్షుడు జగన్ రద్దు చేసుకున్నారు.

ఈ మేరకు బుధవారం ఓ కీలక మీటింగ్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు.పార్టీకి చెందిన అతి తక్కువ మంది నేతలతో పాటు, అతి ముఖ్యమైన నాయకులతో ఆయన ఈ భేటీ నిర్వహించడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.

ఆదివారం విడుదలయిన ఎగ్జిట్ పోల్స్‌తో ఈ భేటీని బుధవారం నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.మారిన షెడ్యూలు ప్రకారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం నుంచి సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిని జగన్ సమీక్షిస్తారు.

దీనికోసం రేపు సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.ఇక్కడ కౌంటింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహం, ఎగ్జిట్ పోల్స్ మీద చర్చ నిర్వహించేందుకు జగన్ సిద్ధం అవుతున్నాడు.

-Telugu Political News

కేంద్రంలో ఎన్‌డీఏనే మళ్లీ అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని సర్వేలూ స్పష్టం చేసినా ఏపీ విషయానికి వచ్చేసరికి స్పష్టత లేదు.కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి.మరికొన్ని మళ్లీ టీడీపీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుందని సంకేతాలు ఇచ్చాయి.అలాగే మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ ఏపీలో టీడీపీ అధికారం లోకి వస్తుందని తేల్చేయడం మీద చర్చ పెట్టే అవకాశం కనిపిస్తోంది.

జాతీయ చానళ్లు చెబుతున్నట్టు ఇరు పార్టీల మధ్య ఓట్ల శాతంలో అంత తేడా ఉండే అవకాశం లేదంటున్నారు.జాతీయ చానళ్లు చెబుతున్నట్టు 5 నుంచి 10 శాతం ఓట్ల తేడా అంటే ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని, కానీ బూత్ స్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని వైసీపీ భావిస్తోంది.

దీంతో ఈ విషయాలన్నింటిపై కీలకంగా మాట్లాడేందుకు జగన్ పార్టీకి చెందిన పలువురు నేతలతో సీరియస్‌గా మంతనాలు చేస్తున్నారు.అసలు ఏపీలో వైసీపీకి అనుకూల పవనాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు జగన్ లో బాగా కనిపిస్తున్నట్టు అర్ధం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube