జగన్ కూడా చేతులెత్తేసారా ? పార్టీని కాపాడేది ఎవరు ?

తమకు ఎదురే లేదని భావిస్తున్న జగన్ కు ఇప్పుడు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.రాజకీయ ప్రత్యర్థులు కొట్టే దెబ్బ కంటే, సొంత పార్టీ నేతలే పార్టీని ఇబ్బందులపాలు చేసే విధంగా ప్రయత్నిస్తూ ఉండటం, జగన్ కు మింగుడు పడడం లేదు.

 Jagan Troubled On Party Leaders Behaviour About Group Politics, Ysrcp, Jagan, Ml-TeluguStop.com

ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే తంతు కనిపిస్తోంది.ముఖ్యంగా గ్రూపు రాజకీయాలతో వైసీపీ లో పెద్ద యుద్ధమే జరుగుతుంది.

ఎవరికి వారు పార్టీలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ, మీడియా ముందుకు ఎక్కి మరి విమర్శలు చేసుకుంటున్నారు.ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాల్సిన వారు సొంత పార్టీ నాయకుల మీదే, విమర్శలు చేస్తూ అల్లరి అల్లరి చేస్తున్నారు.

ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వచ్చిన నాయకుల కారణంగా వస్తున్న తలపోట్లు అన్నీ ఇన్ని కాదు.

మొదటి నుంచి వైసీపీలో ఉన్న నాయకులకు కొత్తగా పార్టీలోకి వచ్చి చేరిన వారికి మధ్య వివాదాలు తలెత్తడం, ఎవరికి వారు తామే గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తుండడం వంటి కారణాలతో వైసీపీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

మొన్నటివరకు నేతల మధ్య ఉన్న గ్రూపు తగాదాలు అంతర్గతంగా నే ఉండేవి.కానీ ఇప్పుడు బహిరంగంగానే ఒకరిపై ఒకరు దూషణకు, కొట్లాటలకు దిగుతూ మీడియాలో హైలెట్ అవుతుండడంతో, వైసీపీ రాజకీయ ప్రత్యర్ధులకు వినోదంగా మారింది.

ఈ వ్యవహారాలపై ఎప్పటి నుంచో జగన్ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా ఇంచార్జి మంత్రుల ద్వారా ఈ వివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా, ఫలితం కనిపించడం లేదు.

Telugu Amanchikrishna, Duttaramchandar, Jagan, Karanam Balaram, Mlas Ministers,

హైకమాండ్ నుంచి వార్నింగ్ లు వచ్చిన రెండు మూడు రోజులపాటు అంత సైలెంట్ గానే ఉన్నా, మళ్ళీ యధావిధిగా తమ రాజకీయాలకు పదును పెడుతూ సొంత పార్టీ నేతలు ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు.కొద్ది రోజుల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య ఫ్లెక్సీల వివాదం పెద్ద దుమారమే రేపింది.అలాగే గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీ, ఆ పార్టీ సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్ర రావు మధ్య అంతేస్థాయిలో వివాదం చెలరేగి మీడియాలో హైలెట్ అయ్యింది.

ఇక్కడే కాదు ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు పరిస్థితి ఇదే విధంగా తయారవడం, జగన్ వాటిని అదుపు చేసే పరిస్థితి లేకపోవడం వంటి వ్యవహారాలు రానున్న రోజుల్లో వైసీపీకి తీరని చేటు తెస్తాయని, ఫలితంగా అధికారం కోసం కాచుకు కూర్చున్న తెలుగుదేశం పార్టీకి మేలు జరుగుతుందనే అభిప్రాయం వైసీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube