టీడీపీ కంచుకోటల్లో వైసీపీ బలపడిందా ..? సర్వేలో తేలిందేంటి..?       2018-06-08   22:56:07  IST  Bhanu C

ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ సీపీకి ఐరోజులు వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఒకవైపు పాదయాత్రతో వైసీపీ అధినేత జగన్ ప్రజల్లో తిరుగుతూ .. వారి సానుభూతి బాగానే సంపాదిస్తున్నట్టు అర్ధం అవుతోంది. దీనికి తోడు అధికార పార్టీ మీద జనాల్లో ఉండే వ్యతిరేకత కూడా వైసీపీ కి కలిసొస్తున్నట్టు సర్వేలు తేల్చుతున్నాయి. ఇటీవల ఒక మీడియా సంస్థ, ఇంకో అంతర్జాతీయ సంస్థ కలిసి ఏపీలో చేపట్టిన సర్వే ద్వారా జనం నాడి బయటకి వచ్చింది. జగన్ పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి వైసీపీ కి అనూహ్యంగా మద్దతు పెరిగినట్టు సర్వేలో తేలింది.

టీడీపీ కి మంచి పట్టు ఉన్న తూర్పు,పశ్చిమ,కృష్ణ,గుంటూరు జిల్లాల్లో వైసీపీ కి అనూహ్యమైన మద్దతు పెరిగినట్టు సర్వేల్లో బయటపడింది. ఇక సాధారణంగానే రాయలసీమ జిల్లాల్లో ఆ పార్టీ బలంగా ఉంటుంది. గత ఎన్నికలను చూసుకుంటే.. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసిపి ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది.కానీ అక్కడ 15 నియోజకవర్గాల్లో జగన్ కు సరాసరి 40 నుంచి 45 శాతం ఓటర్ల ఆమెద ముద్ర ఉందట. తూర్పుగోదావరి జిల్లాలో కేవలం రెండే సీట్లు వైసీపీ గెలుచుకుంది. ప్రస్తుతం వైసీపీ అక్కడ సగం మంది ఓటర్లు అనుకూలంగా ఉన్నారట.

అంతే కాకుండా .. టీడీపీ కి మంచి పట్టు ఉన్న కృష్ణ,గుంటూరు జిల్లాల్లో కూడా జగన్ గ్రాఫ్ పెరగడం.ఇక్కడ కొన్ని నియోకవర్గాల్లో వైసిపి కి 50 శాతం వరకు ప్రజామోదం ఉందట అంతే కాదు చంద్రబాబు,తెలుగుదేశం గ్రాఫ్ కిందటేడాదితో పోల్చుకుంటే 10శాతం పడిపోయిందట. ఈ లెక్కన చూసుకుంటే ఏపీ అంతటా ఫ్యాన్ గాలి బాగానే వీస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి ఈ లోపు టీడీపీ ప్రభుత్వం తమ లోపాలను సరిచేసుకుని ప్రజల్లో మరింత మద్దతు కూడగట్టుకుంటే.. పరిస్థితుల్లో మార్పు కలగవచ్చు.