జనసేన స్పీడు వైసీపీని కలవరపెడుతోందా ..?  

Ysrcp Gets Tense With Janasena Speed-

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ వల్ల ఏమవుతుంది ? జనసేన ప్రభావం ఈ ఎన్నికల్లో అంతంత మాత్రంగానే ఉంటుందని అన్ని రాజకీయ పార్టీలు భావించాయి. పవన్ ఏదో ఓకే పార్టీతో అంతకాగడం తప్ప సొంతంగా పోటీ చేసే సత్తా ఉండదులే అని అంతా భావించారు. అయితే… జనసేన పార్టీ అనూహ్యంగా పుంజుకోవం ఇప్పుడు రాజకీయ పార్టీలకు మింగుడుపడడం లేదు. ముఖ్యంగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ పరిణామం అస్సలు రుచించడంలేదు. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలకు కీలకమైన గోదావరి జిల్లాల్లో జనసేన చాపకింద నీరులా దూసుకుపోవడం ఇతర పార్టీల్లో ఉన్న కీలక నాయకులందరినీ జనసేనలో చేర్చుకోవడం మిగతా పార్టీలకు మింగుడుపడడంలేదు.

Ysrcp Gets Tense With Janasena Speed-

Ysrcp Gets Tense With Janasena Speed

జనసేన బలపడడం టీడీపీకి ఎలా ఉన్నా జగన్ పార్టీకి మాత్రం ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ కి కూడా కాసింత ఇబ్బందిగా వున్నా టీడీపీ క్యాడర్ గానీ, నాయకులు గానీ అంతగా జనసేన వైపు చూడటం లేదు. గోదావరి జిల్లాల్లో చూసుకుంటే ఎక్కువ నష్టం ఇప్పటికైతే వైసీపీకే జరిగిందని తెలుస్తుంది. తూరుపు గోదావరి నుంచి మాజీ ఎమ్మెల్యేలు రాపాక ప్రసాదరావు, రాజేశ్వరి వంటి వారుపార్టీని వీడిపోయారు. పశ్చిమ నుండి భీమవరం రాజు గారు, అల్లూరి పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన బాట పట్టారు . వీరి అందరి కంటే ముందు పితాని బాలకృష్ణ పార్టీని వీడి ఏకంగా జనసేన తరఫున టికెట్ కూడా సంపాదించారు. ఇలా జనసేన వైపు ఆకర్షితులవుతున్న వైసీపీ నేతలు జనసేనలోకి క్యూ కడుతున్నారు.

Ysrcp Gets Tense With Janasena Speed-

వైసీపీ, టీడీపీ నుంచి వస్తున్న నాయకుల బయోడేటా పూర్తిగా పరిశీలించి ఆ తరువాత పార్టీలో చేర్చుకుంటున్నాడు పవన్. అంతే కాదు … ప్రధాన పార్టీల నుండి వస్తున్న నాయకులను ఎన్నికల బరిలోకి దించే ఆలోచనలో కూడా ఉన్నాడు. జనసేనాని చూపించే ఈ దూఒకుడు వైసీపీ కి నష్టం చేస్తుంది. మొదటి దెబ్బ వైసీపీ మీదే పడుతుంది. కానీ వైసీపీ నాయకులు ఇతర పార్టీలవైపు వెళ్లకుండా జగన్ ముందు జాగ్రత్తలు ఏ మాత్రం తీసుకోవడంలేదు. పోతే పోనీ వారు కాకపోతే ఇంకొకరు అన్న ధోరణిలో జగన్ ఉండిపోతున్నాడు. ఇక గోదావరి జిల్లాల్లో పవన్ సామజిక వర్గం వారు ఎక్కువగా ఉండడం కూడా జనసేనకు బాగా కలిసొస్తుంది.