జనసేన ప్రాధాన్యం పెంచేస్తున్న జగన్ ? 

గతంతో పోలిస్తే జనసేన గ్రాఫ్ ఏపీలో బాగా పెరిగినట్టు కనిపిస్తోంది.పవన్ రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకోకపోయినా, జనసేనకు ఈ స్థాయిలో గ్రాఫ్ పెరిగింది.

 Ysrcp Full Focus On Janasena Party-TeluguStop.com

ఏపీలో టీడీపీ బలహీనం కావడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.ఏపీలో వైసీపీ అతిపెద్ద పార్టీగా ఉంది.151 సీట్ల తో విజయం సాధించిన వైసీపీ కూడా జనసేన కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ,  ఆ పార్టీతోనే తమకు పోటీ అన్నట్లుగా పదేపదే జనసేన ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ ఉండడం,  సోషల్ మీడియాలోనూ జనసేన పై సెటైర్ లు వేస్తు, ఎక్కువగా జనసేన చేసే కామెంట్లకు రియాక్ట్ అవుతుంది.పదే పదే వైసిపి నాయకులు పవన్ పై విమర్శలు చేయడం , ఇలా ఎన్నో అంశాలతో ఈ మధ్యకాలంలో ఆ పార్టీ బాగా బలం పుంజుకుంది.అలాగే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన ప్రభావం బాగానే కనిపించింది.

2019 ఎన్నికలతో పోలిస్తే జనసేన ప్రభావం  బాగా పెరిగినట్లు కనిపిస్తోంది.దీనికి తగ్గట్టుగా పదేపదే వైసిపి జనసేన ను టార్గెట్ చేసుకోవడం ఆ పార్టీకి బాగా కలిసి వస్తోంది.కాపు సామాజికవర్గం జనసేన ను ఎక్కువగా ఆదరిస్తూ వస్తుండడంతో కాపు ఓట్లు అన్ని జనసేన కు వెళితే , ఆ ప్రభావంతో తెలుగుదేశం పార్టీ బలహీన పడుతుంది అని, ఇది తమకు కలిసి వస్తుంది అని వైసిపి లెక్కలు వేసుకోవడంతోనే జనసేన ను పూర్తిగా టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

 Ysrcp Full Focus On Janasena Party-జనసేన ప్రాధాన్యం పెంచేస్తున్న జగన్  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటీవల విడుదలైన పవన్ నటించిన  వకీల్ సాబ్ సినిమానే చూసుకుంటే, ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునే విషయంలో వైసిపి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం, బెనిఫిట్ షో లకు అనుమతి ఇవ్వకపోవడం వంటివి వైసీపీ పవన్ ను టార్గెట్ ఏ రేంజ్ లో చేసుకుంది అనే విషయం అర్థం అవుతోంది.

Telugu Ap Cm Jagan, Ap Politics, Bjp, Cbn, Janasena, Pavan Kalyan, Pawan And Jagan, Tdp, Tiket Rates, Vakeel Saab Movie, Vakeel Saab Ticket Rates, Ycp Government, Ycp Targets Janasena, Ycp Vs Janasena, Ysrcp-Telugu Political News

  ఎంతో మంది హీరోల సినిమాలు విడుదలైనా, మరెవరి విషయంలోనూ ఎటువంటి అభ్యంతరాలు వైసీపీ ప్రభుత్వం పెట్టలేదు.కానీ ఇప్పుడు ఈ సినిమా విషయంలో పెట్టడంతో వైసిపి పవన్ అంటే భయపడుతోంది అనే విషయం అర్థం అవుతోంది.పవన్ ను నేరుగా ఢీ కొట్టేందుకు వైసిపి సిద్ధమవుతోందని విషయం లో ఒక స్పష్టత వచ్చింది.

అయితే పదేపదే జనసేనను, పవన్ కళ్యాణ్ ను వైసీపీ టార్గెట్ చేసుకోవడం ద్వారా అనవసరంగా ఆ పార్టీ గ్రాఫ్ పెంచుతున్నారని, ముందు ముందు ఇది వైసీపీ కే నష్టం అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

#Tiket Rates #VakeelSaab #YcpTargets #Janasena #YCP Government

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు