నేను కాకినాడలో వైసీపీ ఎన్నికల శంఖారావం! వైసీపీ అభ్యర్ధుల ప్రకటనపై ద్రుష్టి!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది.ఏప్రిల్ 11న ఎన్నికల జరగనున్నాయి.

 Ysrcp Elections Campaign Will Started From Kakinada-TeluguStop.com

ఇంకా ఎన్నికలకి ప్రధాన పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలు, రాజకీయ కార్యాచరణ, గెలుపు, ఓటములకి నెల రోజుల వ్యవధి మాత్రమె వుంది.ఈ నెల రోజులలో అభ్యర్ధుల ప్రకటన దగ్గర నుంచి పార్టీల ఎన్నికల మేనిఫెస్టోని ప్రజలలోకి తీసుకెళ్ళడం వరకు యుద్ధ ప్రాతిపాదికన తన రాజకీయ కార్యాచరణని పార్టీలు సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది.

ఈ విషయంలో టీడీపీ అధినేత కాస్తా ముందుగా వుండి 130 స్థానాల వరకు అభ్యర్ధులని ప్రకటించేసాడు.

ఇదిలా వుంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వైసీపీ కూడా కార్యాచరణ వేగవంతం చేసి కాకినాడలో ఎన్నికల శంఖారావం సభతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతుంది.

ఈ శంఖారావ సభలో జగన్ ఎన్నికల మేనిఫెస్టో, అలాగే అభ్యర్ధుల ప్రకటన చేసే అవకాశం వుందా అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా వున్నాయి.ఈ శంఖారావం పూర్తి అయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బస్సు యాత్ర ఉండబోతుంది.

ఈ లోపే పార్టీ అభ్యర్ధులని జగన్ ప్రకటించే అవకాశం వున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube