అమ‌రావ‌తి వైసీపీ గాడి త‌ప్పుతోందా.... అంతా వీళ్లే చేస్తున్నారే...!

రాజ‌ధాని జిల్లా గుంటూరులో అధికార పార్టీ వైసీపీ గాడి త‌ప్పుతోందా ? ఎవ‌రికి వారు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రి స్తున్నారా ? అంటే ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.ఎంపీల‌ను ఎమ్మెల్యేలు గౌర‌వించ‌డం లేదు.

 Ysrcp Doing Wrong Step On Amaravathi. Ap. Ap Political News, Ysrcp, Amaravathi,-TeluguStop.com

ఎమ్మెల్యేల‌ను కిందిస్థాయి కార్య‌క‌ర్త‌లు కూడా గౌర‌వించడం లేదు.ఎవ‌రికి ప‌నులు ఉంటే వారితో సంప్ర‌దించి ప‌ని చ‌క్క‌బెట్టుకుంటున్నారు.

తాజాగా జ‌గ‌న‌న్న జీవ‌క్రాంతి ప‌థ‌కాన్ని ప్రారంభించారు.ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాలంటూ.

స్వ‌యంగా ఓ ఎంపీ ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేల‌కు ఫోన్లు చేసి మ‌రీ చెప్పారు.త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ఘ‌నంగా నిర్వ‌హించారు.

Telugu Amaravathi, Chandra Babu, Poitical, Ysrcp-Telugu Political News

ప్రొటోకాల్ ప్ర‌కారం.ఎమ్మెల్యేల‌కు అధికారులు సైతం ఆహ్వానాలు అందించారు.అయితే.ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా ఈ కార్య‌క్ర‌మానికి రాలేదు.ఇక‌, కార్య‌క‌ర్త‌లు కొంద‌రు మాత్ర‌మే వ‌చ్చారు.దీంతో గుంటూరు వైసీపీలో అంత‌ర్గ‌తంగా ఉన్న వివాదాలు మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చిన‌ట్ట‌యింది.

ఇప్ప‌టికే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రికి వారు రాజ‌కీయాలు చేసుకుంటున్న ‌విష‌యం తెలిసిందే.అయితే పార్టీ కీల‌క నేత‌లు క‌లిసి క‌ట్టుగా లేక‌పోవ‌డం మ‌రింత‌గా వివాదానికి దారితీస్తోంది.

అయితే.దీనికి కార‌ణాలేంట‌ని.

ఓ పాత్రికేయ మిత్రుడు ఆరాతీస్తే.సంచ‌ల‌న విష‌యం వెలుగు చూసింది.

ఇద్ద‌రు వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు జిల్లాను పంచేసుకున్నార‌ని ఆయ‌నకు మ‌రో నేత చెప్ప‌డం గ‌మ‌నార్హం.

నిజానికి ఆ ఇద్ద‌రిలో ఒక‌రు ప్ర‌ముఖ దేవ‌స్థానానికి చైర్మ‌న్‌గా ఉండ‌గా.

మ‌రొక‌రు జ‌గ‌న్‌కు స‌ల‌హాదారుగా వున్నార‌ని.వారికి ఈజిల్లాతో సంబంధం లేక‌పోయినా.

ఇక్క‌డి నాయ‌కుల మ‌ధ్య ఉన్న వివాదాల‌ను ప‌రిష్క‌రించే నెపంతో జిల్లాపై ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని తెలిసింది.దీంతో రెండు గ్రూపులుగా విడిపోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు.

స‌ద‌రు సీనియ‌ర్ నేత‌ల క‌నుస‌నన్న‌ల్లో మెలుగు తున్నార‌ని చెప్పారు.అయితే.

ఎవ‌రు ఎవ‌రి క‌నుస‌న్న‌ల్లో మెలిగినా.పార్టీ పుంజుకునేందుకు దోహ‌ద ప‌డ‌కుండా.

ఇలా విభేదాల‌ను, వివాదాల‌ను రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.మ‌రి ఎప్ప‌టికి ఈ మంటలు ఆర‌తాయో ? చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube