స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై వైసీపీ ధీమా! టీడీపీ ఆశలు

అసెంబ్లీ ఎన్నికలలో ఏపీలో జగన్ నాయకత్వంలో వైసీపీ ఊహించని స్థాయిలో భారీ మెజారిటీతో 151 స్థానాలు కైవసం చేసుకుంది.దీంతో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వైసీపీ పరిపాలన విషయంలో చాలా కఠినమైన నిర్ణయాలని ఎలాంటి భయం లేకుండా తీసుకుంటుంది.

 Ysrcp Confidence On Local Body Elections Win-TeluguStop.com

ముఖ్యమంత్రి జగన్ ఓ వైపు సంక్షేమం, నవరత్నాలు అమలు చేస్తూ మరోవైపు పరిపాలనలో తన మార్క్ కనిపించే విధంగా, ప్రజలకి చేరువ అయ్యే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.అయితే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలలో కొంత వ్యతిరేకత వచ్చిన అది పూర్తి స్థాయిలో లేదు.

అయితే టీడీపీ పార్టీ మాత్రం తన అనుకూల మీడియా ద్వారా జగన్ ఎన్నేళ్ళ పాలనలో పూర్తిగా విఫలం అయ్యారని ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తుంది.అమరావతి ఉద్యమాన్ని పదే పదే చూపిస్తూ అదేదో రాష్ట్ర సమస్యగా చూపించే ప్రయత్నం చేస్తుంది.

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రజా చైతన్య యాత్ర అంటూ మొదలెట్టిన అది జనం లేక, ముందుకి సాగడం లేదు.

ఈ నేపధ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.

ఈ నెలలోనే అన్ని ఒకే సారి నిర్వహించాలని ఫిక్స్ అయిన అధికార పార్టీ గెలుపుపై చాలా ధీమాగా ఉంది.ఈ ఎన్నికలలో తమకి సునాయాస విజయం వరిస్తుందని, క్లీన్ స్వీప్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని భావిస్తుంది.

అదే సమయంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది.అదే సమయంలలో జగన్ 9 నెలల పరిపాలనలో పూర్తిగా విఫలం అయ్యాడని మీడియా చేస్తున్న ప్రచారం జనాల్లోకి భాగా వెళ్లిందని మూడు రాజధానులు అని చెప్పిన అది ప్రజా వ్యతిరేకత కారణం అయ్యిందని, అధికార పార్టీ వైఫల్యం తమకి అనుకూలంగా మారుతుందని ఆశలు పెట్టుకుంది.

అయితే మార్పు కోసం అంటున్న జనసేన-బీజేపీ పార్టీలు మాత్రం ఈ స్థానిక సంస్థల ఎన్నికలని తమ పార్టీ క్యాడర్ నిర్మించుకోవడం కోసం, గ్రామీణ స్థాయిలో బలంగా విస్తరించడం కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.భారీ గెలుపు సాధ్యం కాకపోయినా కొన్ని స్థానాలు అయిన సొంతం చేసుకొని బలం నిరూపించుకోవాలని చూస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube