నిమ్మగడ్డ రమేష్ ను ఈసీగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశం! వైసీపీకి చుక్కెదురు

ఏపీలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకుంటున్న చాలా నిర్ణయాలపై హైకోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.అమరావతి భూముల నుంచి, ఇంగ్లీష్ భాష, పంచాయితీ బిల్డింగ్స్ కి రంగులు, అలాగే డాక్టర్ సుధాకర్ వ్యవహారం, భూముల అమ్మకం వంటి కీలక అంశాలలో హైకోర్టు నుంచి ఏపీ ప్రభుత్వానికి అడ్డు పుల్లలు పడుతూనే ఉన్నాయి.

 Ap High Court, Dismiss Election Commission New Ordinance, Ap Politics, Ysrcp, Cm-TeluguStop.com

ఈ నేపధ్యంలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంత కాలంగా హైకోర్టు న్యాయమూర్తులకి కూడా పార్టీ రంగు అంటించి విమర్శలు చేస్తున్నారు.సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి తరుచుగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

తాజాగా మరో సారి ఏపీ ప్రభుత్వంకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

లాక్ డౌన్ కి ముందు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలని అప్పటి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్ తో సహా వైసీపీ నాయకులు అందరూ అసహనం వ్యక్తం చేశారు.

నిమ్మగడ్డ చంద్రబాబు మనిషి అని ప్రచారం చేశారు.ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండా నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా ఏపీ ప్రభుత్వం ఎలక్షన్ కమీషనర్ పదవీ కాలం తగ్గిస్తూ జీవో తీసుకొచ్చి నిమ్మగడ్డని పదవి నుంచి తొలగించారు.దీనిపై అతను హైకోర్టుని ఆశ్రయించారు.

అతని స్థానంలో కొత్త ఎలక్షన్ కమిషనర్ గా జస్టిస్ కనగరాజ్ ని నియమించింది.ఈ కేసు విచారించిన హైకోర్టు ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ ని కొట్టివేసింది.

తిరిగి రమేశ్ కుమార్ ని ఎన్నికల కమిషనర్ గా నియమించి అతని పదవీకాలం ముగిసేంత వరకు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube