బొత్స మేనల్లుడు వైసీపీ కీలక నేతకి కరోనా పాజిటివ్  

Ysrcp Chinna Srinu Covid 19 Botsa Satynarayana - Telugu Ap Politics, Botsa Satynarayana, Corona Effect, Covid-19, Vizianagaram, Ysrcp Leader Chinna Srinu Have A Corona Positive

ఏపీలో కరోనా వైరస్ చాపక్రింద నీరులా విస్తరిస్తుంది.ప్రతిరోజు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.

 Ysrcp Chinna Srinu Covid 19 Botsa Satynarayana

అదే సమయంలో ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తుంది.ఏ మాత్రం అనుమానం ఉన్న సాంపిల్స్ సేకరిస్తూ టెస్టులు చేస్తుంది.

దేశంలో అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రెండో రాష్ట్రంలో ఏపీ ఉంది.ఇదిలా ఉంటే ఇప్పటికే ఏపీలో విజయనగరం జిల్లాలో ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కరోనా బారిన బడి క్వారంటైన్ లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

బొత్స మేనల్లుడు వైసీపీ కీలక నేతకి కరోనా పాజిటివ్-General-Telugu-Telugu Tollywood Photo Image

మరో వైపు తాజాగా మరో వైసీపీ కీలక నేత జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త, స్వయానా మంత్రి బొత్స మేనల్లుడు చిన్న శ్రీను కరోనా బారిన పడ్డారు.

ఈ నేపధ్యంలో ఆయనకు కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో కీలక నేత కావడం వలన వైసీపీ నేతలు తరుచుగా ఆయనని కలుస్తూ ఉంటారు.ఈ నేపధ్యంలో ఆయనని ఈ మధ్య కాలంలో కలిసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు.

వారినితో కాంటాక్ట్ లో ఉన్న అందరూ హోం క్వారంటైన్ లో ఉండాల్సిందిగా సూచించారు.మరో వైపు కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

దీంతో ఆయన హోం క్వారంటైన్ కు వెళ్లిపోయారు.ఈ నేపధ్యంలో ఇంకెంత మంది రాజకీయ నేతలకి కరోనా లక్షణాలు బయటపడతాయో అని టెన్షన్ పడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test