నేడు గవర్నర్ తో జగన్ భేటీ ...!  

  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ శనివారం గవర్నర్‌ నరసింహన్‌ తో భేటీ కానున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై జగన్ గవర్నర్ తో చర్చించనున్నారు. ఏపీలో లక్షల్లో నకిలీ ఓట్లను సృష్టించారని, ఇప్పటికే రకరకాల సర్వేల పేరుతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది కూడా. ఈ నేపథ్యంలో గవర్నర్ తో జగన్ భేటీ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

  • Ysrcp Cheif Jagan Meet To Governer-

    Ysrcp Cheif Jagan Meet To Governer

  • మరోవైపు, బోగస్‌ ఓట్లపై విచారణ ప్రారంభమైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల్‌కృష్ణ ద్వివేది తెలిపారు. 15 రోజుల్లో విచారణ పూర్తవుతుందన్నారు. రాజకీయ పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల్‌కృష్ణ ద్వివేది శుక్రవారం భేటీ అయ్యారు.