పొత్తులపై క్లారిటీ ఇచ్చిన జగన్ !

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సరికొత్త ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నాడు.ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా… పార్టీ నాయకుల్లో జోష్ పెంచుతున్న ఆయన తటస్థులతో కూడా ప్రత్యేకంగా సభలు… సమావేశాలు నిర్వహిస్తూ…వారి మద్దతు కూడగట్టుతున్నారు.

 Ysrcp Cheif Jagan Clarity On Alliances-TeluguStop.com

ఈ విధంగానే ఇకపై అన్ని జిల్లాల్లో ఉన్న ముఖ్యమైన తటస్థ నాయకులతో సమావేశాలు నిర్వహించాలని చూస్తున్నారు.ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు ఎవరితోను పొత్తు ఉండదని, ఎవరికి మద్దతు ఇచ్చేది లేదని, ఎన్నికల తర్వాత ఎవరు ప్రత్యేక హోదా పై సంతకం చేస్తారో వారికి మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు.

కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని ఆయన జోస్యం చెప్పారు.విభజన చట్టంలోని హామీల కోసం పోరాడతామని, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ ,ప్రత్యేక హోదా కోసం పోరాడతాని ఆయన చెప్పారు.తాము నవరత్నాలలో ప్రకటించిన స్కీమ్ లను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఆయన అన్నారు.కియా ప్యాక్టరీ క్రెడిట్ చంద్రబాబు తీసుకున్నా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే అక్కడ ఐదు శాతం మంది స్థానికులకు కూడా ఉద్యోగాలు దక్కలేదని జగన్ విమర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube