బాబు పేరు చెప్పి ఎస్కేపా...  వైసీపీపై విమ‌ర్శ‌లు..!

ప్ర‌భుత్వంలో ఉన్న పార్టీ చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.లేక‌పోతే.

 Ycp Escaped By Using Chandrababu Name, Tdp, Chandrababu Naidu, Ysrcp, Jagan Moha-TeluguStop.com

లేనిపోని క‌ష్టాలు కొని తెచ్చుకున్నట్టే.ఇప్పుడు మంత్రి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్య‌లు.

మున్ముందు జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌పై రాష్ట్రంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.పోల‌వ‌రం విష‌యాన్ని తీసుకుంటే.

కేంద్ర ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్టు విష‌యంలో పూర్తిగా మ‌డ‌మ తిప్పేసింది.రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యానికి.

పోల‌వ‌రం ప్రాజెక్టుకు ఎంత అయితే.అంచ‌నా వ్య‌యం ఉందో.

అంతే ఇస్తామ‌ని తేల్చి చెప్పింది.అంటే.55 వేల కోట్ల ప్రాజ‌క్టు కాస్తా.ఇప్పుడు 23 వేల కోట్ల‌కు జారిపోయింది.

ఇందులోనూ అంతిచ్చాం.ఇంతిచ్చాం.అని చెప్పి.ఇప్పుడు కేవ‌లం 4 వేల కోట్లు మాత్ర‌మే ఇవ్వాలి.

అదిస్తాం.ఇక‌మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి!అంటూ తెగేసి చెప్పింది.

దీంతో ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు ప‌రిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి జారిపోయిన‌ట్టు అయింది.పోల‌వ‌రం ప్రాజెక్టును వ‌చ్చే ఏడాది నాటికి పూర్తి చేసి తీరుతామ‌ని చెప్పిన జ‌గ‌న్ ఈ మాట నిలబెట్టుకునే ప‌రిస్థితి క‌నిపించడం లేదు.

దీంతో ఇప్పుడు ఎదురుదాడికి దిగారు.అదిగో అప్పుడుచంద్ర‌బాబు 23 వేల‌కోట్ల‌కు ఒప్పుకొన్నాడు కాబ‌ట్టి.

కేంద్రం ఇప్పుడు అదే పాట పాడుతోంద‌ని మంత్రి అనిల్ మీడియా ముందుకు వ‌చ్చి వ్యాఖ్య‌లు చేశారు.

Telugu Cr Project, Central, Chandrababu, Ycpescaped, Ysrcp-Telugu Political News

వాస్త‌వానికి చంద్ర‌బాబు.55 వేల కోట్ల‌కు అంచ‌నా పెంచారు.కానీ, ఇంత కాద‌ని కేంద్రానికి లేఖ రాసింది జ‌గ‌న్ పార్టీనే అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.

అయినా కూడా ఇప్పుడు చంద్ర‌బాబును కాద‌ని.వైసీపీకి అధికారం ఇచ్చారు ప్ర‌జ‌లు.

పైగా 22 మంది ఎంపీల‌ను కూడా క‌ట్ట‌బెట్టారు.సో.ఇప్పుడు జ‌రిగిన త‌ప్పులు నెమ‌రు వేస్తార‌ని కాదు క‌దా! త‌ప్పులు స‌రిదిద్ది.ప్రాజెక్టును పూర్తి చేస్తార‌నే క‌దా.

అధికారం ఇచ్చారు.ఇంకా ఇప్పుడు బాబునే బూచిగా చూపిస్తాం.

అంటే.అడ్డంగా బుక్ అవ‌డం ఖాయం.

ఇక‌, రేపు ప్ర‌త్యేక హోదా విష‌యంలోనూ ఇదే మాట అన‌ర‌ని గ్యారెంటీ ఏంటి?

చంద్ర‌బాబు ప్యాకేజీకి ఒప్పుకొన్నాడు కాబ‌ట్టి హోదా ఇవ్వ‌నందున మేం ఏమీ చేయ‌లేమ‌ని చెబుతారా?  ఇందుకా.వైసీపీకి ప్ర‌జ‌లు ఓట్లేసింది? ఇదీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఫిరంగుల మాదిరిగా పేలుతున్న విమ‌ర్శ‌నాస్త్రాలు.సో.ఎటోచ్చీ.కేంద్రం వ‌ద్ద సాధించి.అప్పుడు అదిగో.చంద్ర‌బాబు నిర్వాకంతో ఇలా జ‌రిగింది.మేం ఇలా సాధించాం.

అని చెప్పుకొంటే.అది నిబ‌ద్ధ‌త అవుతుంది కానీ.

బాబు వ‌ల్లే తేలేక పోయాం.అనే వ్యాఖ్య‌లు చేత‌గాని త‌నానికి నిద‌ర్శ‌నంగా లేవా? అంటున్నారు ప‌రిశీల‌కులు.మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube