బంద్‌తో జగన్‌ పైచేయి.. ఆలోచనలో బాబు

ప్రత్యేక హోదా కోసం ఏపీలో నేడు వైకాపా రాష్ట్ర బంద్‌ను నిర్వహిస్తుంది.తాజాగా పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా కోసం టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టడం, ఆ అవిశ్వాస తీర్మానం వీగి పోవడం జరిగింది.

 Ysrcp Called Bandh Today Over Demand For Special Category Status-TeluguStop.com

ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ అవిశ్వాసం డ్రామా ఆడటం జరిగిందని, చిత్త శుద్ది లేని టీడీపీ ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం అంటూ నాటకాలు ఆడుతుంది అటూ వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏపీలో ప్రత్యేక హోదా బంద్‌ గతంలో పలు సందర్బాల్లో జరిగింది.

అయితే గతంలో జరిగిన బంద్‌కు టీడీపీ కొన్ని సార్లు, జనసేన కొన్ని సార్లు మద్దతుగా నిలిచాయి.

ఈసారి బంద్‌కు మాత్రం టీడీపీ, జనసేన మరియు ఇత ప్రతిపక్ష పార్టీలు దూరంగా ఉంటున్నాయి.

వైకాపా ఒంటరిగానే బంద్‌ను కొనసాగిస్తుంది.ఈ సమయంలోనే టీడీపీపై వైకాపా నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు.

ఇక జగన్‌ ట్విట్టర్‌ ద్వారా బంద్‌ విషయమై స్పందిస్తూ.టీడీపీ ప్రత్యేక హోదాకు వ్యతిరేకం అంటూ మరోసారి నిరూపితం అయ్యింది.

తాము ప్రత్యేక హోదా కోసం బంద్‌కు పిలుపునిస్తే టీడీపీ మాత్రం బంధ్‌ను భగం చేసేందుకు ప్రయత్నిస్తుంది.ప్రత్యేక హోదాకు వ్యతిరేకం కాకుంటే బంద్‌కు మద్దతుగా నిలిచేవారు అంటూ జగన్‌ ట్వీట్‌ చేశాడు.

మరో వైపు టీడీపీ వారు ఈ బంద్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కారణంగా ప్రజల్లో కాస్త అనుమానాు వ్యక్తం అయ్యే అవకాశం ఉంది.ప్రత్యేక హోదా కోసం వైకాపా మాత్రమే పోరాడుతుందనే అలోచన వారికి కలిగే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు రాజీనామాలు చేశారు.ఇప్పుడు బంద్‌లు, ఉద్యమాలు చేస్తున్న కారణంగా ప్రజల్లో వైకాపా మైలేజ్‌ పెరుగుతుంది.

వైకాపా ఇలా ప్రత్యేక హోదా విషయమై ప్రజల్లో మైలేజ్‌ను దక్కించుకుంటున్న కారణంగా చంద్రబాబు నాయుడు ఆలోచనల్లో పడ్డట్లుగా అనిపిస్తుంది.ధర్మ పోరాటం అంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్నప్పటికి కేంద్రం మరియు ప్రజలు దాన్ని గుర్తించడం లేదు.

ఇలా బంద్‌లు నిర్వహించిన వారికే ప్రజలు కనెక్ట్‌ అవుతారు అనే భయం టీడీపీ నాయకుల్లో వ్యక్తం అవుతుంది.ప్రత్యేక హోదా ఉద్యమంతో వైకాపా తమపై పై చేయి సాధిస్తుందని టీడీపీ నాయకులు భయపడుతున్నారు.

చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుని, పార్టీపై, ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా, విశ్వాసం చూపేలా చేయాలని టీడీపీ నాయకులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube