మేము అందులో ... 'దూరం' ! తేల్చేసిన వైసీపీ !  

  • ఎట్టకేలకు తెలంగాణ ఎన్నికల విషయంలో ఎట్టకేలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పటివరకు ఈ అంశం పై ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న వైసీపీకి అన్నివైపులా నుంచి ఒత్తిడి పెరగడంతో … ఇక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే… డిసెంబరులో జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ దృష్టంతా రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంచడం సరైనదని ఆ పార్టీ భావించింది. అందుకే తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.

  • Ysrcp Away From Telangana Elections-

    Ysrcp Away From Telangana Elections

  • ఈ మేరకు శనివారం (నవంబరు 10) పత్రికా ప్రకటన విడుదల చేసింది. గడచిన నాలుగన్నరేళ్లలో జరిగిన పరిణామాలకు పరిగణనలోకి తీసుకున్నాక, తెలంగాణలో పార్టీ పరిస్థితిని అంచనా వేసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ ప్రకటించింది.