“జగన్ ,పవన్” ల మధ్య డీల్ కుదిరినట్టే..రీజన్ ఇదేనా.   YSRCP And Janasena Alliance     2018-03-30   06:26:29  IST  Bhanu C

ప్రస్తుత రాజకీయాలు గోడమీద పిల్ల లా ఎప్పుడు ఎటువైపు దూకేద్దమా అనేట్టుగానే ఉన్నాయి..ఇప్పటి రాజకీయ పరిస్థితులని చూస్తుంటే మేధావులు సైతం విస్తు పోయే పరిస్థితి ఏర్పడింది..ఒక పక్క ప్రాంతీయ పార్టీలు అన్ని కలిపి కేంద్రంలో మోడీ లాంటి ఒక బలమైన నాయకుడిని డీ కొట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి..ఇదిలాఉంటే మరో పక్క ఏపీ లో ‘చంద్రబాబు’ ను ఎలా దించాలా అని వైసీపి ,పవన్ ,బిజెపి విశ్వప్రయత్నాలు చేస్తోంది…గత కొంత కాలంగా ఈ మూడు పక్షాలు కలసి అధికార టిడిపిని ఎన్ని ఇబ్బందులకి గురిచేస్తున్నారో వేరే చెప్పనవసరం లేదు..అయితే చంద్రబాబు వారు పన్నే కుయుక్తులకి తగ్గట్టుగా దీటుగా జవాబు చెప్తున్నారు కూడా..

ఇదిలాఉంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఈ మూడు పార్టీలు కలసి పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్లు ఆయా పార్టీల నాయకుల మాటలను బట్టి కానీ వారు ప్రవర్తిస్తున్న తీరుని బట్టి గానీ అందరికీ అర్థం అవుతోంది..మూడు పార్టీలు పొత్తు కుదుర్చుకుంటాయా..లేకపోతే అవగాహనతో పోటీ చేస్తాయా అంటే…ప్రస్తుతం…’జగన్‌’, ‘పవన్‌’ల మధ్య ఒక అవగాహన అయితే ఉందని అంటున్నారు.. వీరి మధ్య ఇప్పటికే ఈ విషయంపై చర్చ కూడా జరిగిందనే టాక్ వినిపిస్తోంది..అంతేకాదు పొత్తు కి సిద్దంగా ఉన్నారని టాక్..

అయితే జగన్ తో స్నేహ భంధం ఉంటుందని చెప్పానికి నిదర్శనం గుంటూరు లో జరిగిన జనసేన సభ అంటున్నారు..జనసేన సభలో తాను…గెలవకున్నా…టిడిపిని ఓడించగలనని వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే…వచ్చే ఎన్నికల్లో టిడిపితో తాను నడవనని స్పష్టంగా చెప్పడంతో…ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు…’జగన్‌’,’పవన్‌’లు పొత్తు పెట్టుకుంటారనే మాట ఆయా పార్టీ నాయకుల నుంచి వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా…ఇటీవల ‘జగన్‌’ నిర్వహించిన పార్టీ సమావేశంలో ‘పవన్‌’ను తమ పార్టీ నాయకులు విమర్శించ వద్దని…ఆయన ఎప్పటికైనా తమతో కలసి వచ్చేవారనేనని చెప్పారట…అందుకే ఇదివరకంటే ఇప్పుడు పవన్ పై వైసీపి మాటల దాడి తగ్గించింది అని చెప్పవచ్చు..ఎన్నికల్లో..వీరిద్దరి మధ్య అవగాహన కానీ లేక పొత్తుకానీ కుదుర్చి చంద్రబాబుకి ఏపీలో రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనేది బీజేపి నిర్ణయంగా విశ్లేషకుల అభిప్రాయం.