వైఎస్సార్ చేయూత పథకం లబ్దిదారుల ఖాతాల్లో రూ.18,750 -సీఎం జగన్

రాష్ట్రంలో మహిళలకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది.మహిళల సాధికారతే లక్ష్యంగా వైఎస్సార్ చేయూత పథకాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.మొదటి విడత సాయంగా బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి రూ.18,750లు జమ చేశారు.ఈ వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో అర్హత ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75,000లను ఉచితంగా ప్రభుత్వం అందించనుంది.

 Cm Jagan, Andra Pradesh, Ysr Cheyutha Scheme,-TeluguStop.com

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.

ఈ వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.మహిళా సాధికారతే లక్ష్యంగా అక్కాచెల్లమ్మల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు.

ఇప్పటివరకు 45 నుంచి 60 ఏళ్ల మహిళకు ఏ పథకం లేదని.ఈ పథకం ద్వారా వారి కుటుంబాలకు మంచి జరగాలని కోరుతున్నానని అన్నారు.లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో రూ.18,750 జమ చేస్తున్నామని., నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సహాయం అందుతోందని సీఎం జగన్ తెలిపారు.కాగా, ఈ పథకం ద్వారా దాదాపు 25 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుతుందని స్పష్టం చేశారు.ఈ పథకం కోసం రూ.4,700 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.గతంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా ఈ పథకం ద్వారా దాదాపు 25 లక్షల మంది మహిళలు నాలుగేళ్లలో రూ.17 వేల కోట్లు లబ్ది పొందనున్నట్లు సీఎం జగన్ అన్నారు.ఆర్ధిక సహాయాన్ని పెట్టుబడిగా మార్చుకుని స్వయం ఉపాధి పొందే అవకాశమని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube