జగన్ సర్కార్ పెళ్లి కానుక.. పెళ్లి కూతుళ్లకు వర్తింపు

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడం భారంగా మారింది.

 Ysr Pelli Kanuka Scheme 2020, Ys Jagan, Peli Kanuka, Marriage-TeluguStop.com

దీంతో పాటుగా పెళ్లి అయిన తర్వాత పెళ్లి కూతుళ్లు అత్తారింటికి వెళ్లినా అభద్రత ఏర్పడుతుండటంతో వైఎస్సార్ ప్రభుత్వం పెళ్లి కానుక పథకానికి శ్రీకారం చుట్టింది.ఈ పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక సాయాన్ని అందించనుంది.

దీంతో పాటు బాల్య వివాహాల నియంత్రించడం, వివాహాలను రిజిస్ట్రేషన్ చేయడం వంటి పనులను నిర్వర్తించనుంది.వైఎస్సార్ పెళ్లికానుకకు సంబంధించి దరఖాస్తు వివరాలు, రిజర్వేషన్ పరంగా పెళ్లి కూతుళ్లు పొందే డబ్బు మొత్తాన్ని ఈ వివరంగా తెలుసుకుందాం.

పెళ్లి అయిన నవ దంపతులు మండల సమాఖ్య లేదా మెప్మా కార్యాలయంలో పెళ్లికానుక పథకం కింద దరఖాస్తు చేసుకోవాలి.అనంతరం అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన నిర్వహిస్తారు.

అయితే వివాహానికి ముందే సాయానికి 20 శాతం డబ్బును పెళ్లి కూమార్తె బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది.పెళ్లి తర్వాత మిగిలిన మొత్తాన్ని అందజేసి వివాహ ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తారు.

పెళ్లికానుక పథకానికి వధువు, వరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి.ఇద్దరి ఆధార్ కార్డు (వధువుది కచ్ఛితంగా తెల్ల రేషన్ కార్డు) ఉండాలి.

వివాహ వయసు కలిగి ఉండాలి.పెళ్లికానుకలో భాగంగా ఎస్సీ ఆడబిడ్డకు రూ.40,000. ఎస్సీ కులాంతర వివాహానికి రూ.75,000.ఎస్టీ ఆడబిడ్డకు రూ.50,000.ఎస్టీ కులాంతర వివాహానికి రూ.75,000.బీసీ ఆడబిడ్డకు రూ.35,000.బీసీ కులాంతర వివాహానికి రూ.50 వేలు.మైనార్టీ ఆడబిడ్డలకు రూ.50వేలు.దివ్యాంగులకు రూ.లక్ష అందించనుంది.మరిన్ని వివరాలకు https://ysrpk.ap.gov.in/Dashboard/index.html వెబ్ సైట్ కి లాగ్ ఇన్ అయి సమాచారాన్ని పొందవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube