జనసేన నాయకుడిపై... వైసీపీ నాయకుల హత్యాయత్నం   Ysr Congress Party Leders Trying To Murder Janasena Leader     2018-10-19   19:04:50  IST  Sai M

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ కక్షలు పెట్రేగిపోతున్నాయి. ఏదో మాటల వరకు ఈ వివాదాలు ఉంటే ఫర్వాలేదు కానీ ఏకంగా చంపుకునే వరకు వెళ్లడం నిజంగా దురదృష్టకరమే. ఈ విధంగానే… కృష్ణా జిల్లా నందిగామలో జనసేన నాయకుడిపై వైసీపీ నాయకులు హత్యాయత్నం చేశారు.

జనసేనకు చెందిన చలమల శ్రీనివాస్‌పై వైసీపీకి చెందిన బుల్లి అలియాస్ గుంటుపల్లి రామకృష్ణ, మువ్వా శేషగిరి, షేక్ సాదా దారికాచి చావబాదారు. ఆయుధాలతో విరుచుకుపడ్డారు. రాళ్లతో ఎటాక్‌ చేశారు. దీనికి సంబంధించిన తతంగం అంతా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.