ఆ ఇద్దరితో జగన్ కు ఇబ్బందేగా ? కుల చిచ్చు పెడుతున్నారుగా ?

రాజకీయ వ్యూహాలు అనేది ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి.ఎప్పుడూ ఒకే పార్టీది పైచేయిగా ఉంటుందా అంటే అది కుదరని పని.

 Ysr Congress Party Is Troubled By The Caste Politics Of The Janasena Tdp  ,-TeluguStop.com

అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలకు భవిష్యత్తు లేకుండా చేసేందుకు అధికార పార్టీ, ఇలా నిత్యం ఒకరిపై ఒకరు ఎత్తులు, పైఎత్తులు వేసుకుంటూ రాజకీయం నడిపిస్తూ ఉంటారు.రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది మరి.ఇక విషయానికి వస్తే ఏపీలో రాజకీయాలు చిత్రవిచిత్రంగా మారిపోతున్నాయి.అధికార పార్టీ దూకుడుగా ముందుకు వెళుతూ, ప్రతిపక్షాలకు బలపడే అవకాశం ఇవ్వకుండా చేస్తుండడంతో, అధికార పార్టీ హవా తగ్గించేందుకు ప్రతిపక్షాలు కొత్త ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం కాపు నేస్తం పేరుతో వైసీపీ ప్రభుత్వం అర్హులైన కాపు మహిళలకు నేరుగా బ్యాంక్ అకౌంట్ లో సొమ్ము జమ చేసింది.ఈ వ్యవహారంతో అధికార పార్టీకి మరింత క్రేజ్ కాపుల్లో పెరిగిందనే అభిప్రాయం టిడిపి, జనసేన పార్టీలో వ్యక్తమవుతున్నాయి.

ఇదే జరిగితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే అభిప్రాయానికి ఆ రెండు పార్టీలు వచ్చేశాయి.అందుకే మొదటిసారిగా జనసేన పార్టీ నేరుగా కాపుల అంశాన్ని తెర మీదకు తీసుకు వచ్చింది.

మొదటి నుంచి కాపులనే నమ్ముకుని జనసేన పార్టీ రాజకీయాలు చేస్తున్నా, ఎక్కడా ఆ విషయాన్ని బయట పెట్టకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.కానీ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి కాకుండా వైసీపీకి కాపులంతా మద్దతు తెలపడంతో ఇక లాభం లేదని అభిప్రాయంతో పవన్ ఇప్పుడు నేరుగా కాపుల మద్దతు కూడగట్టుకునేందుకు రంగంలోకి దిగిపోయినట్టుగా వ్యవహరిస్తున్నారు.

జనసేన పార్టీ కాపుల పక్షంగా ఉంటుందనే సంకేతాలు ఆ వర్గం ప్రజల్లో కల్పించడానికి పవన్ తాపత్రయపడుతున్నట్టుగా కనిపిస్తోంది.ఈ విధంగా వైసీపీ బలం తగ్గించాలనే ఎత్తుగడతో ముందుకు వెళ్తున్నారు.ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సరికొత్త వ్యూహాలతో నే వ్యవహరిస్తున్నారు.2019 ఎన్నికలకు ముందు కాపులను మచ్చిక చేసుకునేందుకు చంద్రబాబు పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కాదు.

Telugu Janasena, Ys Jagan, Ysr Congress, Ysrcongress-Telugu Political News

కాపు కార్పొరేషన్ పేరుతో పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయడం, వారికి ప్రాధాన్యత కల్పించడం వంటివి ఎన్ని చేసినా, ఆ సామాజిక వర్గం ప్రజలు నమ్మడం లేదు.పైగా ఐదు శాతం కాపులకు రిజర్వేషన్ ఇస్తున్నట్లు ప్రకటించినా, అప్పట్లో వర్కౌట్ కాలేదు.పైగా కాపులకు అత్యధిక ప్రాధాన్యం టీడీపీ ఇస్తుంది అనే అభిప్రాయం బీసీ సామాజిక వర్గాల్లో పెద్ద ఎత్తున రావడంతో, మొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా బీసీలు వైసీపీకి మద్దతు పలికారు.అప్పటి ఫలితాలు చూస్తే ఎంత ఆగ్రహంతో ఉన్నారు అనే విషయం తెలిసిపోయింది.

జనసేన పార్టీకి ఒకే ఒక్క సీటు దక్కకపోగా, టీడీపీకి 23 సీట్లు మాత్రమే దక్కాయి.కానీ కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్పేసిన వైసీపీకి 151 సీట్లు దక్కడం ఎప్పటికీ టిడిపి జనసేన పార్టీలకు మింగుడుపడని విషయం.

ఇక్కడే టిడిపి అధినేత చంద్రబాబు తన రాజకీయ బ్రెయిన్ కు పదును పెట్టారు.జనసేన అధినేత పవన్ ద్వారా కాపులను దగ్గరకు చేర్చుకుని, తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతిగా వుండే విధంగా ప్లాన్ చేసుకుంటూ, ఆ రెండు వర్గాల ప్రజలను వైసీపీకి దూరం చేయాలనే విధంగా సరికొత్త ఎత్తుగడ లతో ముందుకు వెళ్తున్నారు.

అయితే ఈ వ్యవహారాలను జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది స్పష్టత లేకపోయినా, వైసీపీకి మాత్రం ఈ పరిణామాలు కాస్త ఇబ్బంది కలిగించేవే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube