వైసీపీ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం.. జగన్ ఆగ్రహం నిజమేనా?

ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ అలుపెరగకుండా శ్రమిస్తున్నాడు.తీరికే లేకుండా పరిపాలనపై జగన్ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాడు.

 Ysjagan Very Seriouson Party Mla And Ministers-TeluguStop.com

పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలను స్వయంగా చుసిన జగన్ ఆ సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటీ అమలుచేసుకుంటూ తన చిత్తశుద్ధిని చాటుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.అయితే జగన్ ఆ స్థాయిలో కష్టపడుతుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం చాలా రిలాక్స్ గా తమకేమి పట్టనట్టుగా ఉంటున్నారని దీనిపై జగన్ ఆగ్రహంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

కొంతమంది ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో తిరిగేందుకు మొగ్గు చూపడమేలేదట.దీనిపై జగన్ కు రిపోర్ట్స్ అందినట్టు వాటిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

దీనిపై ఎన్ని విమర్శలు, అక్షింతలు పడినా వారిలో మాత్రం మార్పు కనబడడంలేదట.

ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి వైసీపీలో నెలకొన్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.

అందులోను కొందరి వ్యవహారశైలి విమర్శలపాలవుతోంది.ఏదో గెలిచాములే అన్నట్టుగా నిర్లక్ష్యం వహిస్తూ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారట.151 మంది ఎమ్మెల్యేలు కావడంతో అసలు ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారనేది కూడా ప్రశ్నార్ధకంగా మారిపోయింది.ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ కార్యక్రమాలు జనంలోకి తీసుకెళ్లే విషయంలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

కొంతమంది మాత్రమే యాక్టివ్ గా ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి మంచిపేరు తెస్తున్నారట.

Telugu Chandrababu, Cm Ys Jagan, Janasena, Ys Jagan, Ysrcp Mlas-Telugu Political

ఇదే విషయమై జగన్ కొంత మంది ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్న విషయం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.అసలు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మీకు అవగాహన ఉందా లేదా అనే విషయాన్ని గట్టిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు నేను అన్నిరకాలుగా ప్రయత్నిస్తుంటే మీరు మాత్రం ఇలా నిర్లక్ష్యం చేస్తే ఎలా అని ప్రశ్నించారట.

తానేమి చూసి చూడనట్టు వదిలేయమని, నిర్లక్ష్యం వహించేవారిపై తప్పక చర్యలు ఉంటాయని జగన్ హెచ్చరికలు చేశాడట.మనం ఎంత బాగా పరిపాలన చేసినా అది ప్రజల్లోకి వెళ్లకపోతే ప్రయోజనం ఉండదని సూచించారట.

అలాగే పార్టీ గెలుపుకోసం అహర్నిశలు కష్టపడిన వారిని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించాలని, ఇకపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోబోమని జగన్ కొంతమంది ఎమ్యెల్యేలను ఉద్దేశించి అన్నట్టు పార్టీలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube