వైఎస్ షర్మిల తో వైఎస్ వివేకా కూతురు సునీత..!!

వైయస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడి రెండు సంవత్సరాలు కావడం సీబీఐ విచారణ జరిపి ఏది కూడా తేల్చక పోవటంతో ఇటీవల వైయస్ వివేకా కూతురు డాక్టర్ సునీత సంచలన కామెంట్ చేయడం తెలిసిందే.మా పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి తీవ్రస్థాయిలో సిబిఐ పై ప్రభుత్వ వ్యవస్థల పై మండిపడ్డారు.

 Ys Vivekananda Reddy Daughter With Ys Sharmila-TeluguStop.com

ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన క్రమంలో డాక్టర్ సునీత తన తండ్రి హత్య కేసు విషయంలో తనకి షర్మిల సపోర్టు ఉందని కామెంట్లు చేశారు.

ఇద్దరం కూడా చాలా క్లోజ్ అని కూడా తెలిపారు.

 Ys Vivekananda Reddy Daughter With Ys Sharmila-వైఎస్ షర్మిల తో వైఎస్ వివేకా కూతురు సునీత..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

షర్మిల చాలా స్ట్రాంగ్ లేడీ అని ఖచ్చితంగా సత్యం వైపు నిలబడే మనిషి అని తన తండ్రి హత్య కేసు విషయంలో తప్పు జరిగిందని షర్మిలకి తెలుసని ఏదిఏమైనా నిజం బయటకి రావాలని షర్మిల మనసులో కూడా ఉన్నట్లు డాక్టర్ సునీత అప్పట్లో తెలిపారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం లోటస్ పాండ్ వద్ద షర్మిల దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈక్రమంలో దీక్షా ప్రాంగణంలో షర్మిల వద్దకు డాక్టర్ సునీత రావటం మాత్రమే కాక ఆమెతో కూర్చోవడం జరిగింది.మరోపక్క సీబీఐ మూడోసారి వైయస్ వివేకా హత్యకు సంబంధించి విచారణ చేపట్టడం జరిగింది.

ఇలాంటి తరుణంలో సునీతతో షర్మిల ఉండటం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

#YS Sharmila #YSVivekananda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు