వైయస్ వివేకా హత్య కేసులో నేడు కీలక వ్యక్తులను విచారణ చేస్తున్న సిబిఐ..!!

కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఛేదించడానికి రెండోసారి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.మొదటిసారి విచారణ చేపడుతున్న సమయంలో కరోన రావటంతో.

 Ys Vivekananda Reddy Cbi Case-TeluguStop.com

సిబిఐ దర్యాప్తు బృందం లో అధికారులు కొంతమంది కరోనా బారిన పడటంతో .విచారణ నిలిపి వేయడం జరిగింది.అయితే ఇటీవల మరోసారి మొదటి నుండి సిబిఐ విచారణ స్టార్ట్ చేయటంతో .కేసులో కొంతమంది కీలక వ్యక్తులను ఇప్పటికే రెండోసారి విచారించడం జరిగింది.

ఈ నేపథ్యంలో ఈరోజు ఆరుగురు అనుమానితులను ముఖ్యంగా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి ని మరోసారి సిబిఐ విచారణ చేస్తూ ఉంది.పులివెందుల ప్రాంతానికి చెందిన చిన్న‌ప్ప‌రెడ్డి, రామ‌చంద్రారెడ్డి, కాఫీ పొడి వ్యాపారి సుగుణాక‌ర్‌, సింహాద్రి పురం మండ‌లం సుంకేశుల‌కు చెందిన జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి అదే రీతిలో క‌డ‌ప‌లోని మోహ‌న్ ఆసుప‌త్రి య‌జ‌మాని ల‌క్ష్మీరెడ్డి ని విచారిస్తూ ఉన్నారు.

 Ys Vivekananda Reddy Cbi Case-వైయస్ వివేకా హత్య కేసులో నేడు కీలక వ్యక్తులను విచారణ చేస్తున్న సిబిఐ..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీళ్లందరినీ కడప ప్రాంతంలో కేంద్ర కారాగారంలో అతిథిగృహంలో విచారణ చేస్తూ ఉన్నారు.తాజా విచారణలో పలు కీలకమైన అంశాలను సిబిఐ బృందం రాబట్టినట్లు సమాచారం.

#Ys Viveka #Corona #Jagan #6Members #Erra Gangireddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు