నేడు వైఎస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియలు! వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ఆందోళన  

నేడు వైఎస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియలు. శాంతి యుత ఆందోళనకి పిలుపునిచ్చిన వైసీపీ అధినేత జగన్. .

  • వైసీపీ అధినేత జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఇప్పుడు సిట్ వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ మరణం రాజకీయంగా సంచలనంగా మారడంతో పాటు ఈ మరణం వెనుక మీరున్నారంటే మీరు ఉన్నారు అంటే ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు. ఎన్నడూ చూడని విధంగా మొదటి సారి ఏపీ హత్య రాజకీయాలకి కేంద్ర బిందువుగా మారింది. ఇదిలా ఉంటే నిన్న ఉదయం మరణించిన వివేకానంద రెడ్డి అంత్యక్రియలు ఈ రోజు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు రెడీ అవుతున్నారు.

  • ఇక వైఎస్ వివేకానంద హత్యా ఘటన వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించిన జగన్ ఈ రోజు దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ శ్రేణులు ఈ రోజు శాంతియుత ఆందోళన చేసి గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పారు. ఇక వివేకానంద అంత్యక్రియల అనంతరం వైసీపీ అధినేత జగన్ గవర్నర్ కి కలిసి ఈ హత్యపై సిబిఐ విచారణ కోరడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ హత్య ఉదంతం రాజకీయంగా ఏపీలో ఎలాంటి మార్పులకి కారణం అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.