వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేసిన వారిని గుర్తించిన పోలీసులు  

Ys Vivekanand Reddy Murdered By Some One Mysteries-

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, వైసీపీ అధినేత జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిది సహజ మరణం కాదని, అతనిని ఎవరో హత్య చేసారని కడప డీఎస్పీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరం ప్రాధమిక విచారణకి వచ్చారు.ఈ విషయాన్ని డీఎస్పీ రాకేశ్ దేవ్ శర్మ మీడియా ద్వారా నిర్ధారించారు.

Ys Vivekanand Reddy Murdered By Some One Mysteries- తాజా తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ..ఎలక్షన్ రిజల్ట్స్ విశ్లేషణలు ,రాజకీయ నాయకుల వివరాలు ..కధనాలు -YS Vivekanand Reddy Murdered By Some One Mysteries-

వివేకా ఒంటిపై ఏడూ చోట్ల బలమైన గాయాలు ఉన్నట్లు చేసిన ఆయన ఘటన స్థలంలో వేలి ముద్రలు కూడా సేకరించామని తెలియజేసారు.దీనిని బట్టి ఆయన్ని ఎవరో హత్య చేసి సహజ మరణం క్రింద క్రియేట్ చేసే ప్రయత్నం చేసారని రాకేశ్ దేవ్ స్పష్టం చేసారు.


వైఎస్ వివేకానందని ఎవరు హత్య చేసి ఉంటారనే విషయం మీద ఇప్పటికే కొంత మంది మీద అనుమానాలు ఉన్నాయని తెలియజేసారు.అయితే ఈ విషయంలో పూర్తిగా నిర్ధారణకి వచ్చిన తర్వాత నిందితులని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

ఎన్నికల ముందు వివేకానంద హత్య చేయడం వెనుక రాజకీయ కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామని స్పష్టం చేసారు.అయితే జగన్ తాత రాజారెడ్డి హత్యలో ఒక ముద్దాయిగా జైలు శిక్ష అనుభవించిన సుధాకర్ రెడ్డి మూడు నెలల క్రితం జైలు నుంచి రిలీజ్ కావడం ఇంతలో ఊహించని విధంగా వివేకానంద హత్యకి గురి కావడం వెనుక అతని హస్తం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే వివేకానంద హత్య మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయలలో సంచలనంగా మారింది అని చెప్పాలి.

.

తాజా వార్తలు