మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా పడింది.ఈ క్రమంలో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ఈ నేపథ్యంలో పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం సునీతా రెడ్డి పిటిషన్ పై రెండు వారాల్లో సీబీఐ రిప్లై దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా చార్జ్ షీట్ను కోర్టుకు సమర్పించాలని సూచించింది.
ఒరిజినల్ రికార్డులు అన్నీ కోర్టుకు సీల్డ్ కవర్ లో అందజేయాలని ఆదేశాలు ఇచ్చింది.