వైఎస్ విషయంలో విజయమ్మ అసలు ఆవేదన ఇదా ?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ కీలక నిర్ణయం తీసుకున్నారు.వైయస్ స్నేహితులందరినీ ఒకచోట చేర్చి ఆత్మీయ సమావేశం నిర్వహించేందుకు ఆమె ప్లాన్ చేస్తున్నారు.

 Ys Sharmila, Telangana, Ap, Ysr, Ys Rajashekhar Reddy, Ap Cm Jagan, Ys Vijayamma-TeluguStop.com

వైఎస్ మరణించిన చాలా సంవత్సరాల తర్వాత ఈ మీటింగ్ నిర్వహిస్తుండడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.అసలు వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన చాలా కాలం తర్వాత ఆయన సన్నిహితులు అందరినీ ఒకే చోట చేర్చాలని విజయమ్మ అనుకోవడం వెనుక కారణాలు ఏమిటి ? దీని వెనుక జగన్ షర్మిల ప్రమేయం ఉందా లేక సొంతంగానే విజయమ్మ ఈ నిర్ణయం తీసుకున్నారా ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి.ఇప్పటికీ వైఎస్ హయాంలో మంత్రులుగా, వివిధ కీలక పదవులు అనుభవించిన వారు ఆయనకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన వారందరికీ ఆహ్వానాలు అందాయి.

 వారంతా విజయమ్మతో భేటీ అయ్యేందుకు ఆసక్తిగానే ఉన్నారు.

ఇందులో వివిధ పార్టీల నాయకులు , ఆంధ్ర , తెలంగాణ కు చెందిన వారు ఉన్నారు.అందుకే ఇంతగా ఈ సమావేశం పై అందరిలోనూ ఆసక్తి మొదలైయ్యింది.

ఇదిలా ఉంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన అనుకున్న వారందరినీ చాలా జాగ్రత్తగా చూసుకునే వారు.వారికి మేలు చేసే వాడు.

  శత్రువైన ఆపద సమయంలో ఆశ్రయించిన వారికి సహాయం చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు.అందుకే వైఎస్ మరణం ఇప్పటికీ ఆయన సన్నిహితులు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.

Telugu Ap Cm Jagan, Jagan, Telangana, Ysrajashekhar, Ys Sharmila, Ys Vijayamma-T

ఇక వైయస్ ప్రభావంతోనే జగన్ ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం, పదేపదే రాజశేఖర్ రెడ్డి ని గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్తూ, రాజకీయ మైలేజ్ సాధించి చివరకు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఇవన్నీ జరిగిపోయాయి.  ఇప్పుడు సొంతంగా జగన్ ఇమేజ్ తెచ్చుకున్నారు.రాజశేఖర్ రెడ్డి పేరు ప్రస్తావన లేకుండానే జగన్ రాజకీయంగా మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.ఇక వైయస్ షర్మిల కొత్త పార్టీ పెట్టినా, పదే పదే రాజశేఖర్ రెడ్డి ని గుర్తు చేసుకుంటూనే ఆమె ముందుకు వెళ్తున్నారు.

ఆమె పార్టీ పేరులోనే రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చారు.ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా వైఎస్ పేరు ఏపీ తెలంగాణ లో పదే పదే ప్రస్తావనకు వస్తుంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని రాక్షసుడిగా పేర్కొంటూ,  కొంతమంది పొలిటికల్ కామెంట్స్ చేస్తుండడం,  పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం విషయంలో రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన తెస్తూ విమర్శలు చేస్తున్న , జగన్ రాజకీయ కోణంలో పెద్దగా స్పందించక పోవడం వంటివి విజయమ్మను బాగా కలిసి వేస్తోందట.

 తెలంగాణ లో షర్మిల పార్టీ , ఏపీలో జగన్ పార్టీ కారణంగా చాలా మంది వైఎస్ అభిమానులు దూరంగా ఉండిపోవడాన్ని విజయమ్మ గుర్తించే రాజకీయాలకు అతీతంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి చూపించేందుకు… ఆయన సన్నిహితులు అందరినీ ఒకే వేదిక పైకి తెచ్చి ఇకపై వారి అందరితోనూ ఆత్మీయంగా మెలిగేదుకు ఒక ఫ్లాట్ ఫామ్ ను సిద్ధం చేసుకునే క్రమంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube