షర్మిలకూ ఓ సాక్షి ?

ఇంకా పార్టీ స్థాపించక ముందే తెలంగాణలో వైస్ షర్మిల కు సంబంధించి రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి.ఆమె వ్యూహాత్మకంగా పార్టీ పేరు ప్రకటించకుండా గోప్యత పాటిస్తూనే, తాము పార్టీ పెట్టిన తర్వాత ఏ పార్టీల నుంచి ఎంత మంది నాయకులు వస్తారు ? ఏ ఏ వర్గాల మద్దతు లభిస్తుంది.ఏ సామాజిక వర్గాలవారు తమవైపు ఉంటారు ? పార్టీ పేరు ప్రకటించిన తర్వాత తలెత్తే పరిణామాలు ఏమిటి అనే విషయంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడమే కాకుండా, అత్యంత సన్నిహితులైన నాయకులు, శ్రేయోభిలాషుల ద్వారా ఫీడ్ బ్యాక్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.గతంలో తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేయడం ద్వారా బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడంతో, పార్టీ పేరు ప్రకటించిన తర్వాత అంతే స్థాయిలో ఊపు వస్తుందని, మరోసారి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి తన సత్తా చాటుకోవాలని షర్మిల ముందడుగు వేస్తున్నారు.

 Ys Sharmila Try To Start A New Media Chanel ,ys Sharmila, Jagan, Ap, Telangana,-TeluguStop.com

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజకీయ పార్టీ నడపడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.ఎన్నో తలనొప్పులు ఉంటాయి.పార్టీ విధి విధానాలను, తమ రాజకీయ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకు వెళ్లి, సక్సెస్ సాధించాలి అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నా, ఎలక్ట్రానిక్ ప్రింట్, మీడియా సహకారం తప్పనిసరిగా ఉండాలి.

ఇప్పటికే ఏపీ లో కానీ, తెలంగాణలో కానీ, అన్ని రాజకీయ పార్టీలకు దాదాపుగా సొంత మీడియా చానల్స్, పేపర్స్ ఉన్నాయి.కొన్ని పరోక్షంగా మద్దతు తీసుకుంటున్నాయి.

షర్మిల అన్న జగన్ కూ సాక్షి మీడియా ఉంది.అసలు జగన్ అధికారంలోకి రాగలిగారు అంటే అది సాక్షి మీడియా సహకారమే.

Telugu Jagan, Chanel, Paper, Telangana, Ys Rajashekhara, Ys Sharmila-Telugu Poli

జగన్ ఆలోచనలు, పార్టీ విధానాలను జనాల్లోకి తీసుకెళ్లడమే.మిగతా చాలా చానళ్లు, పత్రికలు ఉన్నా, వాటిపై టీడీపీ ముద్ర ఉంది.వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జగన్ సొంతంగా మీడియా ఛానల్, పత్రికను ఏర్పాటు చేసుకున్నారు.ఆ విధంగా జగన్ కు సాక్షి మీడియా బాగా కలిసి వస్తోంది.ఇప్పుడు షర్మిల పార్టీకి జగన్ మద్దతు లేదనే విషయం తెలిసింది.దీంతో సాక్షి మీడియా కూడా షర్మిలకు పెద్దగా ఫోకస్ ఇవ్వడం లేదు.

దీంతో సొంత పార్టీ పెట్టి జనాల్లోకి వెళ్లి సక్సెస్ అవ్వాలంటే తప్పనిసరిగా సొంత మీడియా ఉండాల్సిందే అనే ఆలోచనకు షర్మిల వచ్చారట.దీనిలో భాగంగానే సొంత ఛానల్, పత్రిక పెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ బాధ్యతలు కూడా జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన ఓ సీనియర్ జర్నలిస్ట్ చూస్తున్నారట.ప్రస్తుతం ఛానల్, పత్రిక నిర్వహించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాకపోవడంతో, జాగ్రత్తగానే ఈ వ్యవహారం అంతా నడిపిస్తూ, పకడ్బందీ ఏర్పాట్లులు చేస్తున్నట్లు ఇప్పుడు వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube