కేసీఆర్ ను ఆ విధంగా టార్గెట్ చేసుకున్న షర్మిల

షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారనే పేరే తప్ప పెద్దగా పొలిటికల్ యాక్టివిటీస్ చేయకపోవడం, కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం పై అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ హడావుడి చేయడం తప్పించి , పెద్దగా ఆమె రాజకీయ వ్యవహారాలు ఏమి చేయక పోవడంపై ఈ మధ్యకాలంలో షర్మిల కు సంబంధించి ఏ చర్చ జరగడం లేదు.దీంతో ఆమె పార్టీ పేరును ప్రకటించకుండానే ఈ పరిస్థితి ఉంటే , రానున్న రోజుల్లో మరింత ఇబ్బందులు ఏర్పడవచ్చనే చర్చ జరుగుతోంది .

 Kcr, Telangana Cm, Un Employment, Gajvel, Trs Party, Bjp, Congress,politics  Tg-TeluguStop.com

షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీ వైపు మిగతా పార్టీల నాయకులు ఎవరూ ఆసక్తి చూడకపోవడం,  చేరికలు పెద్దగా ఉండేలా కనిపించకపోవడంతో షర్మిల రాజకీయ ప్రస్థానం పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

కొద్ది రోజుల క్రితం నిరుద్యోగ దీక్ష పేరుతో షర్మిల హడావుడి చేసినా, ఆ తర్వాత కరోనా ప్రభావంతో సైలెంట్ అయిపోయారు.

ఇక కరోనా బాధిత కుటుంబాల్లోని మహిళలకు అండగా నిలిచేందుకు ఆమె హెల్ప్ లైన్ నంబర్ ను ప్రారంభించారు.ఏదో రకంగా రాజకీయ హడావుడి చేస్తూ,

Telugu Congress, Gajvel, Telangana Cm, Trs, Un-Telugu Political News

  తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఆమె పార్టీ పేరు ప్రకటించే సమయం దగ్గరకు వస్తుండటంతో ఇప్పుడు మళ్ళీ హడావుడిగా తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచి రాజకీయ మైలేజ్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.దీని కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజక వర్గాన్ని ఆమె ఎంచుకున్నారు .ఆ నియోజకవర్గంలో రేపు షర్మిల పర్యటించబోతున్నారు.కేసిఆర్ నియోజక వర్గం అయితే మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఆమె ఇక్కడి నుంచే రాజకీయ వేడి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

రేపు ఉదయం అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి నేరుగా గజ్వేల్ వెళ్లి అక్కడ నిరుద్యోగులతో చర్చించేందుకు ఆమె సిద్ధమవుతున్నారు.ఈ నిరుద్యోగ సమస్యను ఎత్తిచూపడం ద్వారా సులువుగా తెలంగాణ యువత లో పట్టు సంపాదించవచ్చు అనేది ఆమె ఎత్తుగడ గా కనిపిస్తోంది.

అదీ కాకుండా కేసీఆర్  నియోజకవర్గంలో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారని, వారంతా టిఆర్ఎస్ పాలన పై ఆగ్రహంగా ఉన్నారనే విషయాన్ని ఆమె హైలెట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube