దీక్షల పర్వానికి తెరతీయనున్న షర్మిల... ఇక సమరమేనా?

తెలంగాణ రాజకీయాలలో  వైయస్సార్ టీపీ పార్టీ పేరుతో అడుగుపట్టిన విషయం తెలిసిందే.అయితే పార్టీ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసిన తరువాత ఇందిరా పార్క్ లో నిరుద్యోగులకు నోటిఫికేషన్ లు విడుదల చేయాలని నిరసిస్తూ 72 గంటల దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

 Ys Sharmila To Start Hunger Strikes In Telangana To Become The Main Opposition P-TeluguStop.com

అయితే 24 గంటల దీక్ష తరువాత పోలీసులు  దీక్షను భగ్నం చేయడంతో లోటస్ పౌండ్ లోని తన నివాసంలో దీక్షను కొనసాగించిన విషయం తెలిసిందే.అయితే ఇటీవల వైయస్సార్ టీపీ పార్టీని ప్రారంభించిన షర్మిల కెసీఆర్ పై, జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

అయితే ఇక ప్రతి మంగళవారం నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేపట్ట బోతున్నట్టు షర్మిల పార్టీ వర్గాలు తెలిపాయి.అయితే ఇక దశల వారీగా రకరకాల సమస్యలపై దీక్షల పేరుతో తమ నిరసనలను తెలపనున్నట్లు తెలుస్తోంది.

అయితే  షర్మిల పార్టీకి ఇప్పట్లో అంతగా మద్దతు లేకున్నా  మీడియా హైప్ తో మిగతా పార్టీలకు కొంత మేర నష్టం జరిగే అవకాశం ఎక్కువగా  కనిపిస్తోంది.అయితే షర్మిల ఇక రాను రాను తెలంగాణలో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది.

మరి తెలంగాణ రాజకీయాలలో షర్మిల ఎంత మేర సత్తా చాటుతుందో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube