విపక్షాలపై వైఎస్ షర్మిల విమర్శల బాణాలు.. ప్రజలు పట్టించుకుంటారా?

వైఎస్ జగన్, వైఎస్ షర్మిల అన్నాచెల్లెళ్లు. అవినీతి ఆరోపణలు విషయంలో జగన్ జైలుకు వెళ్లిన సమయంలో వైసీపీని షర్మిల ముందుకు నడిపించారు.

 Ys Sharmila Sensational Comments On Opposition Parties,bjp,telangana,trs,cm Kcr,ys Sharmila, Revanth Reddy,telangana Politics, Congress-TeluguStop.com

దీంతో ఆమెలో కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అందరికీ స్పష్టంగా అర్ధమైంది.అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నయ్య జగన్ తనను పట్టించుకోకపోవడంతో షర్మిల అలకబూనారు.

దీంతో ఏకంగా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించారు.

 YS Sharmila Sensational Comments On Opposition Parties,BJP,Telangana,TRS,CM KCR,YS Sharmila, Revanth Reddy,Telangana Politics, Congress-విపక్షాలపై వైఎస్ షర్మిల విమర్శల బాణాలు.. ప్రజలు పట్టించుకుంటారా-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తెలంగాణలో ఇప్పటికే చాలా పార్టీలు ఉండటంతో షర్మిల పార్టీకి ఆదరణ కరువైంది.

ఆ పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు కూడా లేకపోవడం మైనస్ పాయింట్.కానీ షర్మిల మాత్రం రాజకీయ ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు.

తనకు వీలు దొరికినప్పుడల్లా అధికార పార్టీ టీఆర్ఎస్‌పై విరుచుకు పడుతూనే ఉన్నారు.ఇటీవల ఆమె పాదయాత్ర కూడా చేపట్టారు.

అనివార్య కారణాల వల్ల పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు.ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియా ద్వారా షర్మిల రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె అధికార పార్టీతో పాటు విపక్ష నేతలపైనా విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ దొంగ అంటూ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.ఇతర కులాలు నాయకత్వానికి పనికి రావని రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆక్షేపనీయం అని షర్మిల మండిపడ్దారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తుంటే.కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తోందని ఆమె ఫైర్ అయ్యారు.ప్రజలు శాంతియుతంగా జీవించడం ఈ రెండు పార్టీలకు ఇష్టం లేదని ఆమె విమర్శలు చేశారు.

ముస్లింలకు రిజర్వేషన్‌లు రద్దు చేస్తామని బీజేపీ చెప్పడంపై షర్మిల అభ్యంతరం వ్యక్తం చేశారు.అటు కేసీఆర్‌పై అవినీతి ఆధారాలు ఉన్నాయని చెప్తున్న బీజేపీ నేతలు వాటిని ఎందుకు బయట పెట్టడం లేదని షర్మిల ప్రశ్నించారు.అయితే కేసీఆర్‌పై విరుచుకుపడే షర్మిల ఇలా ప్లేటు ఫిరాయించి ఇప్పుడు విపక్షాలపై ఆరోపణలు చేయడం అంతుబట్టని వ్యవహారంలా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఆమె ఆరోపణలు ప్రజలు పట్టించుకుని తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీనే ఆదరించే అవకాశం లేకపోలేదని పలువురు విశ్లేషిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube