కేటీఆర్ అంటే ఎవరు ? ఎన్నో సంగతులు చెప్పిన షర్మిల !

వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న వైఎస్ షర్మిల పొలిటికల్ ఎంట్రీపై జనాల్లోనూ,  రాజకీయ వర్గాల్లోనూ ఎన్నో అనుమానాలు ఉన్నాయి.అసలు షర్మిల పార్టీ నిలదొక్కుకుంటుందా ? పార్టీ ఏర్పాటు వెనుక ఎవరున్నారు ? తన మతం గురించి వస్తున్న కామెంట్స్ , హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ టిపి అభ్యర్థి పోటీ చేస్తారా లేదా ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి షర్మిల సూటిగా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నికల అంశం హాట్ టాపిక్ గా మారింది.దీంతో టీఆర్ఎస్,  బీజేపీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఈ క్రమంలో కొత్త పార్టీ పెట్టిన షర్మిల తమ అభ్యర్థిని నిలబడతారా లేదా అని సందేహాలకు ఆమె క్లారిటీ ఇచ్చారు.అసలు హుజురాబాద్ ఉప ఎన్నికలు పగలు, ప్రతీకారాలు కోసమే వచ్చాయని, ఈ ఎన్నికల వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అంటూ తనను ప్రశ్నించిన మీడియా మిత్రులను తిరిగి షర్మిల ప్రశ్నించారు.

 Ys Sharmila Sensational Comments On Ktr, Ys Sharmila, Telangana, Trs Party, Kcr,-TeluguStop.com

ఈ ఉప ఎన్నికల వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా , రైతులకు ఏమైనా మేలు జరుగుతుందా ? 54 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటే ఇక్కడ తాము పోటీ చేస్తాం, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వమనండి అప్పుడు పోటీ చేస్తాం ! అసలు కుక్క ను నిలబెట్టినా గెలుస్తామనే వాళ్ల అహం కోసం, పగలు ప్రతీకారంతో కోసం తాము పోటీ చేయాలా అని షర్మిల ప్రశ్నించారు.త్వరలోనే తాను పాదయాత్ర చేయబోతున్నా అనే విషయాన్ని షర్మిల వెల్లడించారు.

తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలుపెట్టినట్టుగానే తాను చేవెళ్ల నుంచే పాదయాత్ర మొదలు పెడతానని చెప్పారు.తెలంగాణ రాజకీయాల్లో తాను ప్రభంజనం సృష్టిస్తాను అని షర్మిల అన్నారు.

అలాగే షర్మిల సోదరుడు జగన్ తో విభేదాల కారణంగా తెలంగాణలో పార్టీ పెట్టారనే విమర్శల పైనా ఆమె స్పందించారు.ఎవరితోనూ విభేదాలు కారణం వైఎస్సార్ టిపి పుట్టలేదని, గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ అంటూ స్పష్టం చేశారు.

తాను చేపట్టిన నిరుద్యోగ దీక్ష పై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేయడం పైన ఘాటుగానే షర్మిల స్పందించారు.అసలు కేటీఆర్ అంటే ఎవరు ? సీఎం కొడుకా అంటూ ప్రశ్నించారు.మహిళలు అంటే సీఎం కేసీఆర్ తో పాటు , ఆయన కుమారుడికీ లోకువే అంటూ చెప్పుకొచ్చారు.అలాగే ఏపీ తెలంగాణ మధ్య చోటు చేసుకున్న జలవివాదం పైన స్పందించారు.
 

Telugu Jagan, Sharmilapress, Telangana, Trs, Ysrajashekhar, Ys Sharmila, Ysrtp-T

బోర్డు మీటింగ్ కు పిలిచినా వెళ్లకపోవడం వల్లే, కేంద్రం కలుగచేసుకుని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు.తెలంగాణ కు సంబంధించి ఒక్క నీటి బొట్టూ వదులుకోను అని, అవసరమైతే ఢిల్లీలో కొట్లాడుతాం అంటూ చెప్పారు.ఇంకా అనేక అంశాలపై షర్మిల చాలా స్పష్టమైన సమాధానాలే ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube