ఎన్నో కొత్త సంగతులు చెప్పిన షర్మిల ! అవేంటంటే ?

కొత్త పార్టీ స్థాపించి తెలంగాణలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.వైఎస్ షర్మిల రాజకీయంగా వెనుకబడ్డారు అనే అభిప్రాయాలు చాలా మందిలో కలుగుతున్నాయి.

 Ys Sharmila Revealed So Many Things About Ysrtp In An Interview, Y S Sharmila, Y-TeluguStop.com

ఇప్పటి వరకు పార్టీ పెద్దగా బలోపేతం కాకపోవడం, పార్టీలో చేరికలు అంతంతమాత్రంగానే ఉండడం, బిజెపి కాంగ్రెస్ టిఆర్ఎస్ లపై ఎంతగా విమర్శలు చేస్తున్న , వారు ఎవరు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండడం, ఇలా ఎన్నో అంశాలు షర్మిలకు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.అదే సమయంలో షర్మిల  సోదరుడు ఏపీ సీఎం జగన్ మద్దతు ఆమెకు లేదు అనే ప్రచారం కూడా ఇబ్బందికరంగా మారింది.

ఈ నేపథ్యంలో న్యూస్ ఛానల్ కు షర్మిల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర అంశాలను ఆమె వివరించారు.

ముఖ్యంగా తెలంగాణలో షర్మిల పార్టీకి మీడియా బలం లేదు అనే ప్రచారం పైన ఆమె స్పందించారు.

ముఖ్యంగా సాక్షి మీడియా కవర్ చేయకపోవడంపై ఆమెను ప్రశ్నించగా , తాను సాక్షి కో ఓనర్ ని అని ఆమె స్పష్టం చేశారు.త్వరలోనే ఆమె తెలంగాణలో సాక్షి మీడియా ను లీడ్ చేయబోతున్నారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతూనే ఉంది.

అది కాకుండా సాక్షి మీడియా గ్రూప్ లో షర్మిలకు అధికారికంగా  వాటాలు లేకపోయినా, ఆస్తులు కనుక పంచుకోవాల్సి వస్తే, సాక్షి మీడియాలోనూ ఆమెకు వాటా ఉంటుంది.దీనిని దృష్టిలో పెట్టుకునే ఆమె ఈ విధంగా వ్యాఖ్యానించినట్లు గా అర్థం అవుతోంది.

ఇక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తావన రాగా, తమ పార్టీకి ఇప్పటి వరకు ఆయన ఎటువంటి సహాయం అందించలేదని, ఆయన తమ పార్టీకి సహాయం చేస్తానని గతంలో ప్రకటించారని, ఆయన తనకు సోదరుడు అని షర్మిల వ్యాఖ్యానించారు.
 

Telugu Congress, Jagan, Prasanth Kishor, Sakshi, Yssharmila, Ys Vijayamma, Ysr S

తెలంగాణలో తమ పార్టీకి బలం లేదు అనే వాదన పైన ఆమె రియాక్ట్ అయ్యారు.తన బలం వైయస్సార్ అని వైయస్సార్ అభిమానులు, ఆయన చేపట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారులే తన బలగం అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.ఇక షర్మిల తల్లి విజయమ్మ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు గా ఉంటూ, తెలంగాణలో వైఎస్సార్ టీపీ కోసం పని చేయడం పైన ఆమె స్పందించారు.

అలా ఎందుకు పనిచేయకూడదు అంటూ ఆమె ఎదురు ప్రశ్నించారు.ఆమె వైయస్ రాజశేఖర్ రెడ్డి భార్య, తన తల్లి అని సమాధానం ఇచ్చారు.అధికారం కోసం తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నారా అనే ప్రశ్నకు ఆమె బదులిస్తూ,  పాదయాత్రలు చేస్తే అధికారం రాదు అని, జనాల కోసం పోరాడితెనే వస్తుందంటూ చెప్పారు.ఇంకా అనేక సంగతులు ఆమె సదరు ఇంటర్వ్యూలో స్పందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube