చైత్ర ఇంటి ముందు నిరాహారదీక్ష చేయడానికి రెడీ అయిన వైయస్ షర్మిల..!!

తెలంగాణ రాష్ట్రంలో చైత్ర అనే చిన్న పాపని అత్యాచారం చేసి నిందితుడు తప్పించుకున్న సంగతి తెలిసిందే.చిన్న పాప కావడంతో.

 Ys Sharmila Ready To Fast In Front Of Chaitra's House Ys Sharmila, Chaitra, Kcr-TeluguStop.com

చైత్ర ఘటనపై చాలామంది సెలబ్రిటీలు రియాక్ట్ అవుతున్నారు.నిందితుడు రాజు ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

ఈ క్రమంలో చిత్ర కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలవడం జరిగింది.ఈ సందర్బంగా సైదాబాద్ చిన్నారి కుటుంబ సభ్యులను పలకరించి చిన్నారి ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం పై షర్మిల మండిపడ్డారు.కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో ఆడవాళ్లపై అత్యాచారాలు అంతకుముందు కంటే మూడు రెట్లు పెరిగాయి అని ఆరోపించారు.

కేసీఆర్ ఇంటిలో కుక్క చనిపోతే ఆ కుక్కకి వైద్యం చేసిన వెటర్నరీ డాక్టర్ ని సస్పెండ్ చేయటం మాత్రమే కాక అతని పై కేసు ఫైల్ చేశారు.మరి తెలంగాణ రాష్ట్రంలో అతి చిన్న పాప చనిపోతే ప్రభుత్వంలో కదలిక ఏది.? అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.తల్లిదండ్రుల వద్ద నుండి చైత్ర మృతదేహాన్ని.

పోలీసులు లాక్కుని వెళ్లారని.ఎంతో బాధలో ఉన్న ఆ తల్లిదండ్రులతో పోలీసులు వ్యవహరించాల్సిన తీరు.

ఇదేనా అంటూ ధ్వజమెత్తారు.పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారని మండిపడ్డారు.

ఘటన జరిగిన రోజు అయినా కెసిఆర్ ప్రభుత్వం ఎందుకు రియాక్ట్ కావడం లేదనిషర్మిల ప్రభుత్వాన్ని నిలదీశారు.వీళ్లు దళితులు అని కావాలని.

ఈ ఘటనను నిర్లక్ష్యం చేయాలనుకుంటున్నారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ చైత్ర ఘటన విషయంలో కుటుంబానికి ఎంత నష్టపరిహారం ఇస్తారో.

ఎటువంటి న్యాయం చేస్తారో.నోరు విప్పాలని అప్పటివరకు నిరాహార దీక్ష చేయడం జరుగుతుందని షర్మిల సంచలన ప్రకటన చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube