దూకుడు పెంచిన షర్మిల... అంతా వ్యూహాత్మక ప్రయాణమేనా?

తెలంగాణ రాజకీయాలు ప్రతిపక్షాల, అధికార పక్షం  విమర్శలు, ప్రతి విమర్శలతో  హీటెక్కుతున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం తెలంగాణలో వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

 Ys Sharmila Padayatra Strategy, Telangana Politics, Ys Sharmila, Ys Sharmila Pad-TeluguStop.com

అయితే అంతగా మీడియా ఆదరణ దక్కకున్నా పాదయాత్రను మాత్రం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది.తాజాగా రైతు వేదన దీక్ష పేరుతో తెలంగాణలో ఉన్న రైతుల వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఈ రైతువేదన దీక్ష సందర్భంగా షర్మిల కెసీఆర్ ను ఉద్దేశయించి సంచలన వ్యాఖ్యలు చేసింది.నా పాదయాత్రను ఆపడానికి కెసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఎవ్వరూ ఆపాలని ప్రయత్నించినా నా పాదయాత్ర మాత్రం నిలుపుదల చేసే ప్రసక్తి లేదని షర్మిల అన్నారు.

అయితే షర్మిల పాదయాత్ర పట్ల రాజకీయ విశ్లేషకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఉంది.

Telugu Cm Kcr, Telangana, Trs, Ys Sharmila, Yssharmila, Ysrtp-Political

షర్మిల పాదయాత్ర ప్రయాణాన్ని గమనిస్తే చాలా వ్యూహాత్మకంగా క్లారిటీగా వెళ్తున్నదని ఒక్కసారిగా పార్టీ పేరుతో హడావిడి చేయకుండా పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న పనుల ద్వారా పార్టీకి ప్రజల్లో గుర్తింపు వస్తుందని షర్మిల బలంగా విశ్వసిస్తున్న పరిస్థితి ఉంది.అయితే తన వ్యూహం ఎంత మేరకు ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితులను బట్టి సాధ్యమవుతుందనేది భవిష్యత్తులో మాత్రమే మనకు కొంత అవగాహనకు వచ్చే అవకాశం ఉంది.అయితే ప్రస్తుతం షర్మిల పాదయాత్ర పట్ల ప్రజల్లో పెద్దగా స్పందన లేకపోయినా ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని ప్రజాకర్షక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తును  పదిలం చేసుకునేందుకు షర్మిల చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు సక్సెస్ అవుతాయనేది చూడాల్సి ఉంది.ప్రస్తుతం అయితే ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించిన షర్మిల రానున్న రోజుల్లో ఎటువంటి పంథా ఎంచుకుంటుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube