జగన్ పై కోపం షర్మిల కొత్త పార్టీ ? ఆర్కే కొత్త పలుకులు వైరల్ ! - Ys Sharmila New Political Party Andrajyothi Special Article

ys sharmila angry on ys jagan...says andhra jyothi md rk, Ys sharmila, jagan, ap, Telangana , new political party, kotta paluku - Telugu Abn, Andrajyothi, Kittu, Kotta Paluku, Telangana, Ys Jagan, Ys Sharmila

జగన్ వదిలిన బాణాన్ని అంటూ బాగా ఫేమస్ అయ్యారు జగన్ సోదరి వైఎస్ షర్మిల.రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ఆయన ఆహా భావాలతో షర్మిల రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు.

 Ys Sharmila New Political Party Andrajyothi Special Article-TeluguStop.com

గతంలో అక్రమాస్తుల కేసులో జగన్ జైలు జీవితం గడిపినప్పుడు షర్మిల పూర్తిగా వైసీపీ బరువు బాధ్యతలు భుజాన వేసుకున్నారు.పాదయాత్ర సైతం నిర్వహించి కావల్సినంత  పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

ఒక దశలో జగన్ స్థాయిలో ఆమె వైసీపీ ని ముందుకు నడిపించారు.ఇక ఆ తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

 Ys Sharmila New Political Party Andrajyothi Special Article-జగన్ పై కోపం షర్మిల కొత్త పార్టీ ఆర్కే కొత్త పలుకులు వైరల్  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది.ఎక్కడా షర్మిల ప్రస్తావన కూడా పెద్దగా రావడం లేదు.

కానీ కొద్ది రోజుల క్రితం తెలంగాణలో షర్మిల వైసీపీని ముందుకు నడిపించబోతున్నారని, వైసీపీ తెలంగాణ శాఖ కు ఆమె అధ్యక్షురాలు అని, ఆమె ఆధ్వర్యంలోనే పార్టీ ముందుకు వెళుతోందని వార్తలు వచ్చాయి.

బిజెపిని ఎదుర్కొనేందుకు కేసీఆర్ కోరిక మేరకు తెలంగాణ లో ఆమె యాక్టివ్ అవుతున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది.

తరువాత అది అంతా సద్దుమణిగింది.ఇప్పుడు మాత్రం జగన్ పై షర్మిల చాలా ఆగ్రహంగా ఉన్నారని, పడవుల్లోనూ, పార్టీలోనూ తనకు ప్రాధాన్యం దక్కకపోవడంతో జగన్ పై కోపంతో ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు పేరుతో ఒక సమగ్ర కథనం వెలువడింది.

దీనిపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు పెద్ద చర్చ జరుగుతోంది.జగన్ పై కోపం ఉంటే షర్మిల ఏపీ లో పార్టీ పెట్టి జగన్ కి పోటీ ఇస్తారు కానీ , పూర్తిగా పక్కన పెట్టేసిన తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడం వల్ల జగన్ కు  కలిగే నష్టమేమిటో మాత్రం ఆ కథనంలో ఇవ్వలేదు.

ఏబీఎన్ ఆర్కే కొత్త పలుకులు పేరుతో రాసిన ప్రత్యేక వ్యాసం లో జగన్ పై షర్మిల చాలా ఆగ్రహంగా ఉన్నారని, అందుకే కొత్త పార్టీ పెట్టి జగన్ కు  ఝలక్ ఇవ్వబోతున్నారు అని పేర్కొన్నారు.

అయితే ఆర్కే పలుకులు మొత్తం అసంబద్ధంగా ఉన్నాయని, రాజకీయ గందరగోళం సృష్టించేందుకు ఈ విధమైన కథనం ఆర్ కె వండి వర్చినట్టు గా కనిపిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.అసలు తెలంగాణ లో పార్టీ పెట్టడం వల్ల షర్మిలకు వచ్చే లాభం కానీ, జగన్ కు వచ్చే నష్టం ఏంటి అనేది కానీ ఆర్కే వివరించలేదు.కాకపోతే ఈ కథనం తో కావలసినంత రాజకీయ గందరగోళం మాత్రం సృష్టించాడు.

#AndraJyothi #Kotta Paluku #YS Sharmila #Telangana #YS Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు