తెలంగాణ గడ్డపై పులివెందుల బిడ్డ..! వైఎస్సార్ తెలంగాణ పార్టీ..?

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు.‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ‘ అనే పేరుతోపాటు విధివిధానాలు, అజెండాను ప్రకటించడం కోసం ఖమ్మంలో భారీ బహిరంగ సభ తల పెట్టింది.

 Ys Sharmila Launches Ysr Telangana Party In Telangana State, Ys Sharmila, Sharmi-TeluguStop.com

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల కొత్త పార్టీ ప్రకటనతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి.ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని వైఎస్‌ షర్మిల వెల్లడించారు.

షెడ్యూల్ ప్రకారమైతే 2023లో, జమిలి ఎన్నికలుగానీ వస్తే అంతకంటే ముందే రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకొన్నారు.

ఆమె లోటస్‌ పాండ్‌లోని తన కార్యాలయంలో ఆ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌ అభిమానులతో ప్రతి రోజు సమావేశాలు పెడుతున్నారు.

ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్‌ అభిమానులు, సానుభూతిపరులు అధికార పక్షంతో ఎదురవుతున్న ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకువచ్చారు అట.ప్రస్తుత పరిస్థితుల్లో రాజన్న సంక్షేమ పాలన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆదిశగా షర్మిల వేసే అడుగులో అడుగు వేస్తామని షర్మిల తమ్ములు భరోసా ఇస్తున్నారు.

Telugu Pulivendula, Sharmilapaleru, Sharmila, Telangana, Ysrajasekhara, Ys Sharm

షర్మిల తన తండ్రికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి పులివెందుల ఎలాగో తనకు పాలేరు అలాగేనని అభివర్ణించారు.తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యం మాట.పేద ప్రజల బ్రతుకుల మార్చి వారికి అన్నివిధాలుగా అండగా ఉంటాఅని హామీలు ఇస్తున్నారు.రానున్న ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతా అని షర్మిల ప్రకటించింది….

Telugu Pulivendula, Sharmilapaleru, Sharmila, Telangana, Ysrajasekhara, Ys Sharm

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తన ప్రభంజనాన్ని ఆపలేరని ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ విధి విధానాలను వెల్లడించారు.,దీనిలో భాగంగా షర్మిల.దీనికి సంబంధించిన పోస్టర్‌, జెండాను ఆవిష్కరించారు…సభకు పెద్దఎత్తున వైయస్సార్ అభిమానులు తరలివచ్చి సభను విజయవంతం చేశారు అని అనుకోవచ్చు.

Telugu Pulivendula, Sharmilapaleru, Sharmila, Telangana, Ysrajasekhara, Ys Sharm

పాలేరు నియోజకవర్గంలో ఖమ్మం రూరల్, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాలు ఉండగా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన కొండల ఉపేందర్ రెడ్డి టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుపై 7,669 ఓట్ల మెజార్టీతో గెలిచారు.1999 నుండి ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది.2016 ఉప ఎన్నికల్లో మాత్రం టీఆర్ ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు.ఇప్పుడు షర్మిల కూడా పాలేరునియోజకవర్గం పై పోటీకి సిద్దమయంది.చూడాలి మరి తెలంగాణలో ఎలాంటి పరిణామాలు జరగబోతయో.
…షర్మిల ఖమ్మం పాలేరు నియోజకవర్గం నుండే పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube