తెలంగాణలో గారడీ మాటలు చెబుతున్న తండ్రి కొడుకులు.. !?

కరోనా సమయంలో సరైన చర్యలు తీసుకుని ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయ్యిందని ఇదివరకే ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఎవరు ఎంత అరచుకుంటే ఏంటి.

 Ys Sharmila Key Comments On Kcr And Ktr-TeluguStop.com

ఎన్నికల సమయంలో డబ్బులు పడేస్తే తిట్టుకున్న వారే మళ్లీ అధికార పీఠాన్ని కట్టపెడతారనే ధీమాలో ఉన్న గులాభి బాస్‌కు ఈ విమర్శలు చెవికి ఎక్కడం లేదని ముచ్చటించుకుంటున్నారట.

ఇదిలా ఉండగా తెలంగాణలో కొత్త పార్టీకై సన్నహాలు చేస్తున్న వైఎస్.

 Ys Sharmila Key Comments On Kcr And Ktr-తెలంగాణలో గారడీ మాటలు చెబుతున్న తండ్రి కొడుకులు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

షర్మిల మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.తెలంగాణ ప్రజలకు గారడీ మాటలు చెబుతూ కేసీఆర్ కళ్లు, చెవులు మూసుకొని పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు.

ఇక చిన్న సార్‌ అయిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ప్రజల కష్టాలు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు.ఇంతటి విపత్కర పరిస్దితుల్లో రూ.3,500 విలువ చేసే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ రూ.40 వేల వరకు అమ్ముతున్నారని తెలిసిన పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు ప్రవర్తిస్తున్న తండ్రీ కొడుకులు తమ గారడి మాటలను పక్కన పెట్టి పనితనంలో చురుకుతనం చూపించాలని ఎద్దేవ చేశారు.

#CM KCR #Comments #YS Sharmila #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు