పుట్టిన రోజునే షర్మిల 'నడక ' మళ్లీ మొదలు ?  వర్కవుట్ అయ్యేనా ?

తెలంగాణలో రాజకీయంగా పట్టు పెంచుకునేందుకు వైఎస్ షర్మిల ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు.2023 సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణ అధికార పార్టీ గా మారాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నారు.ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.నిరుద్యోగ దీక్ష పేరుతో పోరాటం చేపడుతూ,  యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు .అలాగే పార్టీలో పెద్ద చేరికలు పెద్ద ఎత్తున ఉండేలా చేసుకోవడంతో పాటు,  ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు వైఎస్ షర్మిల పాదయాత్రను ప్రారంభించారు.ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 150 గ్రామాల్లో షర్మిల పాదయాత్ర కొనసాగింది.

 Ys Sharmila Is Going To Start Padayathra Again On His Birthday Ys Sharmila, Ysrt-TeluguStop.com

అయితే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో గత నెల 11వ తేదీ నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం,  కొండపాక గూడెం లో షర్మిల పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు.
    మళ్లీ అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని కూడా షర్మిల పార్టీ ప్రకటించింది.

అయితే షర్మిల పాదయాత్ర కొనసాగిస్తారా లేక పూర్తిగా మూసివేస్తారా అనే సందేహాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో మొదలవడంతో,  ఈ మేరకు పాదయాత్ర కు సంబంధించిన ప్రకటన షర్మిల పార్టీ నుంచి వెలువడింది .ఈనెల 17వ తేదీ నుంచి పాదయాత్రను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నమనే సంకేతాలు ఇచ్చారు.  డిసెంబర్ 17న షర్మిల పుట్టినరోజు కావడంతో అదే రోజు నుంచి పాదయాత్రను కొనసాగించాలని షర్మిల డిసైడ్ అయ్యారట.మొన్నటి వరకు నిరుద్యోగ సమస్యలు మరి కొన్ని ప్రజా సమస్యల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ షర్మిల పాదయాత్రను కొనసాగించారు.

  అయితే ఇప్పుడు ధాన్యం కొనుగోలు వ్యవహారంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై రైతుల లోనూ,  ప్రజల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుండడం వంటి వ్యవహారాలపై షర్మిల విమర్శలు చేసే అవకాశం కనిపిస్తోంది .
 

Telugu Congress, Sharmila, Telangana, Ys Sharmila, Ysrtp-Telugu Political News

   అలాగే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన టీమ్ కూడా ఈ పాదయాత్ర పై పూర్తిగా అధ్యయనం చేస్తోంది.ఏ ఏ అంశాలపై మాట్లాడాలి ఏ విధంగా టిఆర్ఎస్ ను ఇరుకునబెట్టి వైఎస్సార్ టిపీ ని  జనాలలోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే విషయంపై పీకే టీం కసరత్తు చేస్తోంది.అయితే తన పాదయాత్ర సమయంలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ముందు నుంచి అంచనా వేస్తున్నా, ఈ విషయంలో మాత్రం షర్మిలకు నిరాశే ఎదురవుతోంది.

  రెండో విడత పాదయాత్రలో అయినా షర్మిల ఆశలు నెరవేరుతాయా అనేది అనుమానంగానే మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube