జగన్ మీడియా వద్దు.. టీడీపీ మీడియాకు ముద్దు ? ఏమైంది షర్మిల ?

జగన్ వదిలిన బాణమో, కేసీఆర్ వదిలిన అస్త్రమో, లేక సొంతంగా దూసుకొస్తున్న రాజకీయ సునామినో తెలియదు కానీ, వైఎస్ షర్మిల మాత్రం తెలంగాణలో సెన్సేషన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయారు.నిన్న నిరుద్యోగ దీక్ష పేరుతో టీఆర్ఎస్ ను కంగారు పెట్టారు.

 Ys Sharmila High Priority On Tdp Supporting Media-TeluguStop.com

ఆమె మూడు రోజుల దీక్ష చేయాలని చూసినా, పోలీసుల అభ్యంత్రాలతో దానిని ఒక్కరోజు కే పరిమితం చేసేసారు.షర్మిల సభ అనుకున్న మేరకు సక్సెస్ అయ్యిందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, నిన్న ఆమె వ్యవహరించిన తీరు అనేక సంచలనాలకు,అనేక అనుమానాలకు కారణం అయ్యింది.

కారణం షర్మిల అన్న జగన్ కు చెందిన సాక్షి మీడియా ను ఆమె దూరం పెట్టడమే.అంతే కాదు బహిరంగంగా గానే సాక్షి మీడియా పై అసహనం వ్యక్తం చేస్తూ, మీరు మాకు కవరేజ్ ఇవ్వరని, అయినా ఎందుకు పదే పదే కెమెరాలు అడ్డం పెడుతున్నారు అంటూ షర్మిల అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశం అయ్యింది.

 Ys Sharmila High Priority On Tdp Supporting Media-జగన్ మీడియా వద్దు.. టీడీపీ మీడియాకు ముద్దు ఏమైంది షర్మిల -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతే కాదు టీడీపీ అనుకూల మీడియా గా, వైఎస్ కుటుంబాన్ని పూర్తిగా వ్యతిరేకించే మీడియా గా ముద్ర పడిన ఎబిఎన్ ఇప్పుడు షర్మిలకు అత్యధిక కవరేజ్ ఇవ్వడం, దీనికి తగ్గట్టుగానే షర్మిల సైతం సదరు మీడియాకు స్పెషల్ ఇంటర్వూలు ఇస్తూ, ప్రత్యేకంగా చూడడం చర్చనీయాంశం  అవుతోంది.నిన్న షర్మిల సభలో చోటు చేసుకున్న ఉదంతాన్ని ప్రత్యేకంగా ఏబీఎన్ కవర్ చేసింది.అంతే కాదు వైఎస్ విజయలక్ష్మి స్పందన ను సైతం అంతే స్థాయిలో ప్రాధాన్యం ఇస్తూ కవర్ చేసింది.ఏపీ లో వైఎస్ జగన్ కు పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తుంది రాజశేఖర్ రెడ్డి హయాంలో నుంచి ఆ కుటుంబాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న టీడీపీ అనుకూల మీడియా ఇప్పుడు మాత్రం షర్మిలకు ఈ స్థాయిలో ఫోకస్ పెంచడం వెనుక కారణాలు ఏంటి అనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.

ఇప్పటికే షర్మిల పార్టీకి జగన్ మద్దతు లేదు అనే వార్తలు తీవ్రంగా వస్తున్నాయి.ఇదే సమయంలో సాక్షి మీడియాను షర్మిలను పెద్దగా పట్టించుకోకపోవడం, షర్మిల సైతం ఎబిఎన్ కు ఇస్తున్న ప్రాధాన్యత సాక్షికి ఇవ్వకపోవడం వంటివి ఎన్నో ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం ఉన్న అంశాలుగా మారిపోయాయి.

#AndraJyothi #YS Sharmila #Media Coverej #Sakshi Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు