వైఎస్సార్‌టీపీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిలనీ హైదరాబాద్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.సోమవారం షర్మిల పాదయాత్ర అడ్డుకొని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆమె కేరవాన్ కి నిప్పంటించడం తెలిసిందే.
నర్సంపేట స్థానిక ఎమ్మెల్యే పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ దాడికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి.అదే సమయంలో వైఎస్ షర్మిలని అరెస్టు చేసి లోటస్ పాండ్ కి తరలించడం జరిగింది.
ఇదిలా ఉంటే పాదయాత్రలో టిఆర్ఎస్ శ్రేణులు దాడి చేసిన తన కారును స్వయంగా నడుపుకొని మంగళవారం ప్రగతి భవన్ వెళ్లేందుకు షర్మిల ప్రయత్నించగా హైదరాబాద్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
అయితే కారులో నుంచి దిగేందుకు షర్మిల నిరాకరించగా… కారులో కూర్చున్న షర్మిలని క్రేన్ సాయంతో కారును ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.
ఆ తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ కి అంతరాయం కలిగించారన్న ఆరోపణల కింద షర్మిలపై కేసు నమోదు చేశారు.మంగళవారం సాయంత్రం వరకు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లోనే షర్మిలనీ పోలీసులు ఉంచడం జరిగింది.
అనంతరం వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని షర్మిలనీ రిమాండ్ కి తరలించాలని పోలీసులు న్యాయమూర్తిని కోరారు.
అయితే ఈ క్రమంలో శాంతియుతంగా నిరసనలు చేపట్టినట్లు షర్మిల తరపు న్యాయవాదులు వాదించారు.
పోలీసులు ఉద్దేశపూర్వకంగా షర్మిలాని అరెస్టు చేశారని.జరిగిన ఘటనలకు పెట్టిన కేసులకు పొంతనలేదని వాదించారు.ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి… కేసు వివరాలను పరిశీలించి షర్మిలతో పాటు మరో ఆరుగురుకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేయడం జరిగింది.
దీంతో షర్మిల లోటస్ పాండ్ లో తన నివాసంకి వెళ్లిపోయారు.షర్మిల ఇంటికి రావడంతో విజయమ్మ తన దీక్షను విరమించుకున్నారు.