బ్రేకింగ్: షర్మిల ని అరెస్ట్ చేసిన పోలీసులు..!!

వైయస్ షర్మిల ను పోలీసులు అరెస్టు చేశారు.ఇందిరా పార్క్ నుండి లోటస్ పాండ్ కి పాదయాత్రగా బయల్దేరడంతో తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద షర్మిలను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 Ys Sharmila Arrested Police-TeluguStop.com

పాదయాత్రకు అనుమతులు లేదని పోలీసులు చెప్పినా గానీ ముందుకు వెళ్ళడానికి షర్మిల.ఆమె అనుచరులు ప్రయత్నించడంతో .ఆమెను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.తెలంగాణలో ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లకు సంబంధించి 72 గంటల పాటు గతంలో దీక్ష చేయబోతున్నట్లు షర్మిల ప్రకటించడం తెలిసిందే.

అయితే పోలీసులు ఒక్కరోజు కి మాత్రమే దీక్షకి అనుమతులు ఇవ్వడం జరిగింది.ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్షకు కూర్చున్న షర్మిల టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు.

 Ys Sharmila Arrested Police-బ్రేకింగ్: షర్మిల ని అరెస్ట్ చేసిన పోలీసులు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో దీక్ష అనంతరం పాదయాత్రగా  షర్మిల బయల్దేరారు.అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి ర్యాలీలకు అనుమతులు లేవు.అయినా సరే షర్మిల మరియు ఆమె అనుచరులు పాదయాత్ర చేయడంతో.ఆమెను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

ఈ క్రమంలో షర్మిల అనుచరులకు మరియు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

#YS Sharmila

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు