న‌మ్మిన బంటునే నిండా ముంచిన జ‌గ‌న్‌

జగన్ స్పీడ్ పెంచేశారు.ఇటీవల కాలంలో మాంచి దూకుడు మీదున్న జ‌గ‌న్ త‌న‌దైన స్టైల్లో మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు.2019 ఎన్నికల‌కు గాను రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో అప్పుడే టిక్కెట్ల‌ను ఎనౌన్స్ చేసేశారు.ఈ స్పీడ్ చూస్తుంటే 2019 ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్ ఎలాంటి సూప‌ర్ ప్లాన్‌తో ముందుకు వెళుతున్నాడో అర్థ‌మ‌వుతోంది.

 Ys Jangan Gives Shocks To Janga Krishna Murthy-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే ఏపీకి కీల‌క‌మైన ఓ జిల్లాలో రెండు కీల‌క‌మైన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు జ‌గ‌న్ అప్పుడే త‌న పార్టీ అభ్యర్థుల‌ను ప్ర‌క‌టించి రాజ‌కీయ వ‌ర్గాలకు ఆశ్చ‌ర్యం క‌లిగించారు.ఈ క్ర‌మంలోనే త‌న ఫ్యామిలీని, త‌న‌ను న‌మ్మిన బంటుకు షాక్ కూడా ఇచ్చారు.

దివంగ‌త మాజీ సీఎం కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి మ‌నుమ‌డు, మాజీ మంత్రి కాసు వెంక‌ట‌కృష్ణారెడ్డి కుమారుడు కాసు మ‌హేష్‌రెడ్డి వైకాపా ఎంట్రీ ఘ‌నంగా జ‌రిగింది.గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో జ‌గ‌న్ స‌మ‌క్షంలో మ‌హేష్‌రెడ్డి పార్టీలో చేరారు.త‌న‌కు అల‌వాటైన రీతిలోనే చంద్ర‌బాబు, టీడీపీ నాయ‌కుల‌పై విరుచుకుప‌డిన జ‌గ‌న్ 2019లో జరిగే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల్ని జగన్ ప్రకటించారు.

న‌ర‌సారావుపేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి, గుర‌జాల నుంచి కాసు మ‌హేష్‌రెడ్డి పోటీ చేస్తార‌ని అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు.ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా గుర‌జాలలో వైకాపా త‌ర‌పున ఇన్‌చార్జ్‌గా ఉన్న జంగా కృష్ణ‌మూర్తికి జ‌గ‌న్ బిగ్ షాక్ ఇచ్చారు.

జంగా గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో రెండు ద‌శాబ్దాలుగా చ‌క్రం తిప్పుతున్నారు.కాంగ్రెస్ త‌ర‌పున 1999, 2004 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన జంగాకు 2009లో వైఎస్ టిక్కెట్టు ఇవ్వ‌లేదు.

ఆ త‌ర్వాత వైకాపాలో చేరిన జంగా 2014లో గుర‌జాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube